ఖతార్ రైల్వే కార్మికులకు రమదాన్ బహుమానం

- June 18, 2015 , by Maagulf
ఖతార్ రైల్వే కార్మికులకు రమదాన్ బహుమానం

2015  సంవత్సరంలో రమదాన్ మాస ప్రధాన్యతను పురస్కరించుకుని, 24,000కు పైగా శ్రామికులను కలిగిన ఖతార్ రైలు మార్గాల సంస్థ - 'ఖతార్ రైల్', తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్బిలిటీలోభాగంగా "this Ramadan - a simple thank you"  కార్యక్రమాన్ని ప్రారంభించింది.

దీనిలో భాగంగా  ఖతార్  రైలు అధికారులు, దోహా మెట్రోలొని వివిధ ప్రదేశాలలో పర్యటించి అక్కడి  శ్రామికులతో ఉల్లాసంగా ఇఫ్తార్ విందులో పాల్గోవడమేకాక, వారి అవసరాలను గురించి కూడా తెలుసుకొంటారు.

ఈ విషయమై ఖతార్  రైల్  సీ. ఈ. ఓ. సాద్ అల్-మొహమ్మద్ మాట్లాడుతూ, మయ లక్ష్యాలను చేరుకోవడంలో ముఖ్య పాత్ర వహించే  విదేశీ శ్రామికులకు కృతజ్ఞతలు తెలుపడం మా  ముఖ్య ఉద్దేశం. మా  చిరకాల భాగస్వాములైన  శ్రామికులందరికి అవసరమైన సహాయ, సహకారాలనందించడంలో ఖతార్ రైల్  ముందుంటుందని మరోసారి తెలియచేస్తున్నాం - అన్నారు.

 

దీనితో పాటు, ఖతార్  రైల్ మానేజ్మెంటు, కార్మికులు, కాంట్రాక్టర్లు, భాగస్వాములతో కూడిన ఫుట్ బాల్ లీగ్ యొక్క 3వ ఎడిషన్ను కూడా విడుదల చేశారు.  ఈ టోర్నమెంటు, మంచికి మారుపేరైన ఈ మాసంలో కతర్ రైల్ కుటుంబంలో క్రీడా స్ఫూర్తిని, ఐకమత్యాన్ని పెంపొందిస్తుందని ఆశిద్దాం!

 

 

--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com