రిఫ్ఫా, బహ్రైన్లో నిర్మాణంలోనున్న బ్రహ్మాండమైన మసీదు
- June 18, 2015
రిఫ్ఫాలో నిర్మాణంలోనున్న స్వర్గీయ షైఖా మోజా చింత్ హమాద్ అల్ ఖలీఫా మసీదును సందర్శించిన సందర్భంగా, రాయల్ హైనెస్ ప్రధానమంత్రి ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా - మసీదులు, ప్రజల సంఘీభావానికి, ఐకమత్యానికి విశాలమైన వేదికలుగా నిలిచి, శాంతిని, ప్రేమను, కరుణను ఉద్బోధించాలని సందేసమిచ్చారు.
సాంప్రదాయ బహ్రైని శైలిలో 3000 చ . మీ. విస్తీర్ణంలో, రెండు అంతస్టులలో నిర్మితమవుతున్న ఈ మసీదులో గొప్ప ఉత్సవాలను నిర్వహించడానికి విశాలమైన హాలు, భక్తుల సౌకర్యార్ధమై లిఫ్ట్ సౌకర్యం కూడా ఉన్నాయి. ఇందులో ఒకేసారి 2000 మంది ప్రార్ధన చేయవచ్చు.
ప్రార్ధనకు అమిత ప్రాధాన్యంగల ఇస్లాం మతంలో, ముఖ్యంగా కొత్త నిర్మితమౌతున్న నగర ప్రదేశాల్లో మసీదుల నిర్మాణం, విస్తరణ, అల్లాచే పొగడబడే ధార్మిక పుణ్యకార్యాలలో ఉత్తమమైనదని పరిగణించబడుతుంది.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి, బహ్రెయిన్)
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







