బహ్రెయిన్లలో పెరిగిన బంగారం కొనుగోళ్లు.. అరేబియన్ డిజైన్లకు డిమాండ్!
- January 18, 2023
బహ్రెయిన్: కరోనా మహమ్మారి తర్వాత బహ్రెయిన్ లో బంగారం కొనుగోళ్లు పెరిగాయి. ముఖ్యంగా అరేబియన్ డిజైన్లను వినియోగదారులు అధికంగా కొనుగోలు చేస్తున్నట్లు బంగారు నగల దుకాణాల యజమానులు చెబుతున్నారు. బహ్రెయిన్లలో బంగారం పెట్టుబడికి తాజా ట్రెండ్‌గా మారింది. దీంతో ప్రముఖ బ్రాండ్లతో సహా అనేక దుకాణాలలో బంగారం ఇటీవల పెరిగింది. దేవ్‌జీ రిటైల్ సేల్స్‌కు చెందిన షాజీ C.K మేనేజర్ మాట్లాడుతూ..మహమ్మారి సమయంలో బంగారం డిమాండ్ తక్కువగా ఉందని, కానీ మార్కెట్ స్థిరంగా ఉందన్నారు. స్థానిక మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా అరబిక్ డిజైన్లను రూపొందిస్తామన్నారు. ప్రధానంగా పెట్టుబడి కోసం బంగారం కొనుగోలు చేసే వారు, ధర తగ్గినప్పుడు బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తారని తెలిపారు. బంగారం ధరలలో మార్పులు జరిగిన సమయంలో కొనుగోళ్లకు అధిక డిమాండ్ ఉంటుందన్నారు.
పరిశ్రమలు, వాణిజ్యం, పర్యాటక మంత్రిత్వ శాఖ పరిధిలోని దేశీయ, విదేశీ వాణిజ్య విభాగం గత ఏడాది 9.9 టన్నుల బంగారు ఆభరణాలను హాల్‌మార్క్ చేసిందని మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ షేక్ హమద్ బిన్ సల్మాన్ అల్ ఖలీఫా తెలిపారు. అదే సమయంలో ముత్యాలు, విలువైన లోహాల అమ్మకాలు కింగ్డమ్ నిబంధనలకు కట్టుబడి ఉన్నాయని నిర్ధారించుకోవడానికి మంత్రిత్వ శాఖ గత రెండేళ్లలో బంగారు దుకాణాలలో 3,400 తనిఖీలు చేపట్టామన్నారు. ఇది మునుపటి సంవత్సరంతో పోలిస్తే 38% అధికమన్నారు.
తాజా వార్తలు
- ప్రపంచ తెలుగు మహాసభలు..పెయింటింగ్స్‌కు ఆహ్వానం
- జేడీయూ షాక్ నిర్ణయం: 16 మంది నేతలకు బహిష్కరణ
- 3వ ప్రపంచ తెలుగు మహాసభలు–2026 ముఖ్యాంశాలు
- హరీశ్ రావు తండ్రి భౌతిక కాయానికి నివాళులర్పించిన కేసీఆర్..
- తీవ్ర తుపానుగా ‘మొంథా’.. ఏపీలో హైఅలర్ట్..
- దుబాయ్: ఏపీ మంత్రి టి.జి భరత్ తో మీట్ & గ్రీట్ ఏర్పాటు చేసిన INDEX ఎమిరేట్స్ గ్రూప్
- తెలుగు టైటాన్స్ vs పట్నా పైరేట్స్ పోరు
- యూఏఈలోని భారతీయ ప్రవాసులకు కొత్త చిప్‌తో కూడిన ఈ-పాస్‌పోర్ట్‌లు
- సౌదీలో 44 కొత్త ప్రొఫేషన్స్ లో స్థానికీకరణ అమలు..!!
- యూఏఈ లాటరీ Dh100-మిలియన్ల విజేత అనిల్‌కుమార్ బొల్లా..!!







