పవన్ కళ్యాణ్ - సముద్ర ఖని మొదలెట్టేదెప్పుడంటే.!
- January 18, 2023
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘హరి హర వీరమల్లు’ సినిమాతో బిజీగా వున్నాడు. రేపో మాపో ఈ సినిమా షూటింగ్ పూర్తి కావస్తోంది. తదుపరి పవన్ కళ్యాణ్ ఏ సినిమా చేయబోతున్నాడన్న క్యూరియాసిటీ జనాల్లో నెలకొంది.
ఇప్పటికే హరీష్ శంకర్‌తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమానే పవన్ కళ్యాణ్ తదుపరి పట్టాలెక్కించబోతున్నాడనుకుంటున్నారంతా.
అయితే, అంతకన్నా ముందే పవన్ కళ్యాణ్ ఇంకో సినిమాని ట్రాక్‌లోకి తెచ్చాడు. అదే తమిళ రీమేక్. సముద్రఖని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వినోదయసితం’ సినిమాలో పవన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. సముద్ర ఖని స్వయంగా తెలుగులోనూ డైరెక్ట్ చేస్తున్నాడీ సినిమాకి. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నాడీ సినిమాలో.
ఈ సినిమాని ఈ నెల 27 నుంచి పట్టాలెక్కించనున్నట్లు తాజా సమాచారం. కేవలం 45 రోజులు మాత్రమే ఈ సినిమాకి కాల్షీట్లు కేటాయించాడట పవన్ కళ్యాణ్. ఆ తర్వాత వెంటనే హరీష్ శంకర్ సినిమాని కూడా సెట్స్‌పైకి తీసుకెళ్లే యోచనలో పవన్ వున్నాడట.
తాజా వార్తలు
- ఈసారి మాములుగా ఉండదంటూ కార్యకర్తల్లో జోష్ నింపిన జగన్
- ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం
- అరబ్-భారత సహకార వేదిక ఉజ్వల భవిష్యత్తుకు వారధి..!!
- ఖతార్, భారత్ మధ్య పెట్టుబడి అవకాశాలపై చర్చలు..!!
- షార్జాలో సినిమా ఫక్కీలో కారు చోరీ.. దొంగ అరెస్ట్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ కెమెరా వ్యవస్థ మొదటి దశ ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో ఫాగ్, రెయిన్స్ హెచ్చరికలు జారీ..!!
- అంతరిక్ష రంగంలో మరిన్ని పెట్టుబడులకు ఒమన్ పిలుపు..!!
- పిల్లల ఇంటర్నెట్ వాడకం పై కఠిన నిబంధనలు..
- తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు







