‘Mada 9’ సూపర్ కారును తయారు చేసిన తాలిబన్లు..
- January 19, 2023
కాబుల్: తాలిబన్లు అంటే రాక్షసత్వం,నిరంకుశత్వం, ప్రజలు ఇలాగే ఉండాలనే ఆంక్షలు ముఖ్యంగా మహిళల విషయంలో అంతలేని ఆంక్షలు,వారి ఆదేశాలను అతిక్రమిస్తే అనాగరికంగా శిక్షించే ఘటనలు ఇవే గుర్తుకొస్తాయి. 2021 ఆగస్టులో అఫ్ఘానిస్థాన్ ను స్వాధీనంచేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత తాలిబన్లు చెప్పిందొకటి చేసేది మరొకటి. తమదైన శైలిలోనే మహిళలపై ఆంక్షలు విధించారు.ఎంతోమంది దేశం వదిలిపోయారు.
ముజాహిదీన్ నాయకులను మించిన రాక్షసత్వంతో హింసాత్మక చర్యలకు పాల్పడే నరరూప రాక్షసులు అనే మాట ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మాట. అటువంటి తాలిబన్లు తుపాకులతో కాల్చేయటమేకాదు వారిలో ప్రతిభ దాగుందని నిరూపించారు.
అప్ఘానిస్థాన్ లో తాలిబన్ల చేతులు తుపాకులు కాల్చటమే కాదు కార్లు తయారు చేస్తారని నిరూపించారు. ఓ సూపర్ కారును తయారు చేశారు తాలిబన్లు. అప్ఘాన్ చరిత్రలోనే తొలి స్పోర్ట్స్ కారు తయారు చేసి మాలోను ప్రతిభాపాటవాలు ఉన్నాయని నిరూపించారు తాలిబన్లు.అప్ఘానిస్థాన్ దేశ చరిత్రలోనే ‘తొలి స్పోర్ట్స్ కారు’ మడా 9 ( Mada 9 supercar)ను తాలిబన్లు ఆవిష్కరించారు. ఈ సూపర్ కారు ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
అప్ఘానిస్థాన్ తాలిబన్లు తొలిసారి దేశీయంగా ఓ సూపర్ కారును తయారు చేయడం అంటే అదో ప్రపంచ వింత అనే చెప్పాలి.తాలిబన్లు తయారు చేసిన ఆ సూపర్ కారుకు మడా 9 ( Mada 9 supercar)అనే పేరు పెట్టారు.ఈ కారు లుక్ చూస్తుంటే.. బుగాటీ, లాంబొర్గిని, ఫెరారీ లాంటి సూపర్ కార్లకు ఏమాత్రం తీసిపోదని తెలుస్తోంది. ఈ సూపర్ కార్లకు తాలిబన్ల మడా 9 కారు పోటీ ఇస్తుందనేలా ఉంది. 30మంది తాలిబన్ ఇంజనీర్లు ఈ కారు మడా9ను తయారుచేశారని తెలిపారు.దేశీయంగా తయారు చేసిన ఈ కారును చూసి తాలిబన్ ప్రభుత్వం ప్రశంసలు కురిపించింది.
ఇప్పటికీ ప్రొటోటైప్ దశలోనే ఉన్న సూపర్ కారును డెవలప్ చేయడానికి ఐదేళ్లకు పైనే సమయం పట్టింది. ఎన్‌టాప్, కాబుల్‌లోని అప్ఘానిస్థాన్ టెక్నికల్ వొకేషనల్ ఇన్‌స్టిట్యూట్ (ఏటీవీఐ)కి చెందిన 30 మంది ఇంజినీర్లు ఈ కారును తయారు చేశారు. ఈ మడా 9 సూపర్ కారులో టొయోటా కొరొల్లా ఇంజిన్ వాడారు. ఎన్‌టాప్ ప్రధాన కార్యాలయంలో బుధవారం (జనవరి 18,2023)ఈ కారును ఆవిష్కరించారు. సూపర్ లుక్ తో కళ్లు తిప్పుకోనివ్వని అందం రిచ్ గా ఈ కారు కనిపిస్తోంది.
తాజా వార్తలు
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్‌లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!







