సికింద్రాబాద్: షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం..
- January 19, 2023
హైదరాబాద్: సికింద్రాబాద్ లోని రామ్‌గోపాల్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నల్లగుట్ట వద్ద గల డెక్కన్ నైట్ వేర్ స్పోర్ట్స్ షో రూమ్ లో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో అక్కడి వారంతా పరుగులు పెట్టారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా షాపింగ్ మాల్లో మంటలు వ్యాపించినట్లు తెలుస్తుంది. ప్రమాద సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకొని మూడు ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. షాపింగ్ మాల్ ఫస్ట్ ఫ్లోర్‌లో బట్టల దుకాణం ఉండటంతో మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి.
భారీగా మంటలు వ్యాపించటంతో భయాందోళనకు గురైన 10 మంది వ్యక్తులు భవనంపైకి చేరుకున్నారు. వారిని రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. భారీ క్రేన్ల సాయంతో వారిని సురక్షితంగా కిందకు దింపారు. దట్టమైన పొగల కారణంగా మంటల్ని అదుపు చేయటం కష్టంగా మారింది. ప్రధాన రహదారిపై వైపు వాహనాలను దారి మళ్లించి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నారు. అలాగే మంటలు పక్క భవనాలకు కూడా వ్యాపిస్తున్నాయి. దీంతో సమీప భవనాల్లో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని అగ్నిమాపక సిబ్బంది వెల్లడించారు.
తాజా వార్తలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!







