ప్రపంచరికార్డు సాధించేలా కంటి వెలుగు కార్యక్రమమం: సి.ఎస్ శాంతి కుమారి
- January 19, 2023
హైదరాబాద్: నేటి నుండి దాదాపు వంద రోజుల పాటు కొనసాగే కంటి వెలుగు కార్యక్రమంలో ప్రపంచ రికార్డు సాధించేలా కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేర్కొన్నారు. హైదరాబాద్ లిబర్టీ ఏవీ కాలేజ్ లో కంటి వెలుగు కార్యక్రమ నిర్వహణ ను సి.ఎస్ శాంతి కుమారి నేడు ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు.రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం.రిజ్వి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మొహంతి తదితర ఉన్నతాధికారులతో కలిసి కంటి వెలుగు పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా సి.ఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ...2018 లో నిర్వహించిన తొలి విడత కంటి వెలుగు కార్యక్రమంలో దాదాపు 1.57 కోట్ల మందికి కంటి పరీక్షలు నిర్వహించి 45 మందికి కంటి అద్దాలు పంపిణీ చేసి ప్రపంచ రికార్డు సాధించడం జరిగిందని వివరించారు.రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న లాంఛనంగా ప్రారంభించారు.ప్రస్తుత కంటి వెలుగు కార్యక్రమంలో తొలివిడత రికార్డు ని అధిగమించి సరికొత్త రికార్డు సాధించగలమని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుత కంటి వెలుగును సమర్దవంతంగా నిర్వహించడానికి 15,000 మంది వైద్య, ఆరోగ్య సిబ్బంది తో కూడిన 1500 బృందాలు రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 12,768 శిబిరాలు, పట్టణ ప్రాంతాల్లో 3,788 శిబిరాలలో కంటి పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.ఈ శిబిరాల్లో ప్రత్యేక సాఫ్ట్ వేర్ సహాయంతో నాణ్యమైన కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని,అవసరమైన వారికి అక్కడికక్కడే రీడింగ్ అద్దాలు అందజేయడం జరుగుతుందని చెప్పారు.రాష్ట్రంలోని అన్ని నిర్దారిత ప్రాంతాల్లో నేడు కంటి వైద్య పరీక్షలు ప్రారంభమయ్యాయని శాంతి కుమారి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు







