అయ్య బాబోయ్.! ఆ హీరోయిన్‌కి కోపమొచ్చేసింది.!
- January 20, 2023
సహజంగానే సెలబ్రిటీలపై దుష్ప్రచారాలు, గాసిప్స్ తరచుగా వినిపిస్తుంటాం. కొందరు సెలబ్రిటీలు లైట్ తీసుకుంటారు. కొందరైతే ఘాటుగా స్పందిస్తుంటారు.
అయితే, మన హీరోయిన్‌కి మాత్రం తనపై జరుగుతున్న దుష్ప్రచారానికి ఎక్కడ లేని కోపమొచ్చేసిందండోయ్. ఇంతకీ ఎవరా హీరోయిన్.? ఏంటా గాసిప్.? ఆ వివరాల్లోకి వెళితే, సంక్రాంతికి ‘వీర సింహా రెడ్డి’, ‘వాల్తేర్ వీరయ్య’తో పాటూ ఓ చిన్న సినిమా కూడా రిలీజ్ అయిన సంగతి చాలా మందికి గుర్తుండి వుండదు. సంతోష్ శోభన్ హీరోగా వచ్చిన ‘కళ్యాణం కమనీయం’ సినిమా అది. ఆ సినిమాలోని హీరోయిన్ పేరు ప్రియా భవానీ శంకర్.
సీరియల్స్ నుంచి సినిమాల్లోకి ప్రమోట్ అయిన ముద్దుగుమ్మ ఈ భామ. ఎక్కువ డబ్బులు సంపాదించేయడం కోసమే, సినిమాల్లోకి వచ్చేశావా.? అంటూ ఓ నెటిజన్ ఫన్నీగా కామెంట్ చేశాడట పాపను. అంతే కోపం కట్టలు తెంచుకుంది ప్రియా పాపకి. అవును నిజమే, డబ్బుల కోసమే సినిమాల్లోకి వచ్చా.. అయితే ఏంటట.! అని దురుసుగా కసురుకుంది. ఇంత చిన్న విషయానికే అంత గుస్సా అయితే ఎలా పాపా.? అంటూ అమ్మడిని సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు ఇంకొందరు నెటిజనం.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?