కళ్ల కింద బ్లాక్ సర్కిల్స్ ఇబ్బంది పెడుతున్నాయా.?

- January 21, 2023 , by Maagulf
కళ్ల కింద బ్లాక్ సర్కిల్స్ ఇబ్బంది పెడుతున్నాయా.?

ఒకప్పుడు వయసుతో పాటే కళ్ల కింద ముడతలూ, నల్లని వలయాలూ ఏర్పడేవి. అదేనండీ బ్లాక్ సర్కిల్స్. కానీ, ఇప్పుడలా కాదు. మార్కెట్లో విరివిగా లభించే రకరకాల ఫేస్ క్రీములు గట్రా, వాతావరణంలోని కాలుష్య కారకాలు.. తదితర కారణాలతో వయసుతో సంబంధం లేకుండా బ్లాక్ సర్కిల్స్ వస్తున్నాయ్.

వీటిని తగ్గించుకోవడానికి మార్కెట్లో పలు రకాల క్రీములు లభ్యమవుతున్నాయ్. అయితే వాటి వల్ల తాత్కాలిక పరిష్కారమే కాకుండా, ఆ సమస్య మరింత పెద్దదయ్యే అవకాశాలూ లేకపోలేదు.
అందుకే ఇంట్లోని చిన్న చిన్న రెమెడీస్‌తో ఈ డార్క్ సర్కిల్స్ తొలిగించుకోవచ్చని డెర్మటాలజీ నిపుణులే చెబుతున్న సలహా.

రెండు కప్పుల టమోటా రసంలో రెండు చుక్కల నిమ్మరసం కలిపి కళ్ల కింద ప్యాక్‌లా వేసుకోవాలి. పది నిముషాల తర్వాత కడిగేయాలి. ఇలా క్రమం తప్పకుండా కొన్ని వారాల పాటు చేస్తే ఫలితం వుంటుంది.

తాగేసిన గ్రీన్ టీ బ్యాగులను చన్నీటిలో ముంచి వాటిని కళ్ల కింద కాసేపు పెట్టినా ఫలితం వుంటుంది.అలాగే, కీర దోస ముక్కలు కళ్ల కింద వలయాలు తగ్గించేందుకు బాగా ఉపకరిస్తాయ్.a

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com