ఎన్నికల టెంటుకు నిప్పు.. నలుగురికి మూడేళ్ల జైలు శిక్ష, BD 3,000 జరిమానా
- January 21, 2023
బహ్రెయిన్: 2022 పార్లమెంటరీ, మునిసిపల్ కౌన్సిల్ ఎన్నికలలో ఒక అభ్యర్థి ఎన్నికల ప్రచార టెంటును తగలబెట్టిన కేసులో నలుగురికి మూడేళ్ల జైలు శిక్ష పడింది. నష్టపరిహారంగా సామూహికంగా BD3,000 జరిమానా చెల్లించాలని బహ్రెయిన్ కోర్టు ఆదేశించింది. 12 నవంబర్ 2022న బహ్రెయిన్‌లో కౌన్సిల్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, మునిసిపల్ కౌన్సిల్ మెంబర్లను ఎన్నుకోవడం కోసం బహ్రెయిన్‌లో జరిగిన సాధారణ ఎన్నికల సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటన జరిగిన రోజున నిందితులు ముఠాగా ఏర్పడి అభ్యర్థికి చెందిన టెంట్‌ను తగలబెట్టాలని సామూహికంగా నిర్ణయం తీసుకున్నారని కోర్టు ఫైల్స్ చెబుతున్నాయి. ఘటన తర్వాత నిందితులు పారిపోయే క్రమంలో సెక్యురిటీ గార్డులకు దొరికిపోయారు.
తాజా వార్తలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!







