సైన్స్, టెక్నాలజీ, స్పేస్‌లో బ్రిటన్, భారత్ లతో వ్యూహాత్మక భాగస్వామ్యం: సౌదీ

- January 21, 2023 , by Maagulf
సైన్స్, టెక్నాలజీ, స్పేస్‌లో బ్రిటన్, భారత్ లతో వ్యూహాత్మక భాగస్వామ్యం: సౌదీ

దావోస్: సైన్స్, టెక్నాలజీ, స్పేస్‌లో బ్రిటన్, భారత్ లతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సౌదీ అరేబియా ప్రకటించింది. ఈ మేరకు సౌదీ కమ్యూనికేషన్స్, IT ఇంజినీర్ మంత్రి అబ్దుల్లా అల్-స్వాహా పేర్కొన్నారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ 2023 వార్షిక సమావేశంలో భాగంగా బ్రిటిష్ సెక్రటరీ ఆఫ్ బిజినెస్, ఎనర్జీ, ఇండస్ట్రియల్ స్ట్రాటజీ గ్రాంట్ షాప్స్, భారతీయ రైల్వేలు, కమ్యూనికేషన్లు, ఎలక్ట్రానిక్స్ & ఐటీ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్‌ లతో అల్-స్వాహా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సైన్స్, టెక్నాలజీ, అంతరిక్ష రంగాలలో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరించడం గురించి చర్చించారు. టెక్నాలజీ, ఇన్నోవేషన్, డిజిటల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ రంగాలలో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం గురించి చర్చించారు.  రెండు సమావేశాలకు సౌదీ అరేబియా కమ్యూనికేషన్స్, స్పేస్ & టెక్నాలజీ కమిషన్ (CST) గవర్నర్ డాక్టర్ మహమ్మద్ అల్-తమీమి హాజరయ్యారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com