పాశ్చాత్య దేశాల కంటే యూఏఈలో గ్రోసరీ ధరలు 50% తక్కువ!

- January 21, 2023 , by Maagulf
పాశ్చాత్య దేశాల కంటే యూఏఈలో గ్రోసరీ ధరలు 50% తక్కువ!

యూఏఈ: బ్రెడ్, చీజ్, పండ్లు, కూరగాయలు, శీతల పానీయాలు వంటి కిరాణా వస్తువులు యూఎస్, యూరోపియన్ దేశాల కంటే యూఏఈలో 50 శాతం తక్కువకే లభిస్తున్నాయి. నిత్యావసర ధరల ఫ్రీజ్, తక్కువ ఇంధన ధరల కారణంగా యూఏఈలో నిత్వావసర ధరలు స్థిరంగా ఉన్నాయి. దేశంలో పన్నులు తక్కువగా ఉన్నందున కొన్ని అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే యూఏఈ పండ్లు, కూరగాయలు వంటి కొన్ని వస్తువుల ధరలు 50 శాతానికి పైగా తక్కువగా ఉన్నాయని స్థానిక చిల్లర వ్యాపారులు, ఆర్థికవేత్తలు చెబుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం ప్రభుత్వాలకు సవాల్‌గా మారింది. ప్రపంచంలోని మిగిలిన దేశాలు ఆకాశాన్నంటుతున్న ఆహారం, ఇంధన ధరలతో బాధపడుతుండగా, యూఏఈ దాని అభివృద్ధి చెందిన మార్కెట్ సహచరులతో పోల్చినప్పుడు తక్కువ స్థాయి ద్రవ్యోల్బణాన్ని చూసింది. యూఏఈలో ద్రవ్యోల్బణం 6.77 శాతంగా ఉండగా... ఐరోపా దేశాలలో తొమ్మిది శాతం, యుఎస్‌లో 6.5 శాతంగా ఉంది. ఇక ఫిలిప్పీన్స్, పాకిస్థాన్‌లలో ఉల్లిపాయలు, గోధుమలు, ఇతర ఆహార వస్తువుల కొరతను ఎదుర్కొంటున్నాయి. ఫలితంగా ఆ దేశాల్లో ధరలు భారీగా పెరిగాయి.

నవంబర్ 2022లో యూఏఈ కేబినెట్ అవసరమైన వినియోగ వస్తువుల కోసం కొత్త ధర విధానాన్ని తీసుకొచ్చింది. ఇందులో వంట నూనె, బియ్యం, చక్కెర, పాడి, బ్రెడ్, గోధుమ వంటి ఉత్పత్తులు ఉన్నాయి. రాబోయే నెలల్లో బియ్యం, వంటనూనె, గోధుమలు, పప్పులు, సుగంధ ద్రవ్యాలు, టీ, కాఫీ, తృణధాన్యాల ధరలు తగ్గడం వల్ల నివాసితులు ప్రయోజనం పొందుతారని ఫస్ట్ అబుధాబి బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్ సైమన్ బల్లార్డ్ అంచనా వేస్తున్నారు. రోజువారీ ఆహార పదార్థాలైన బ్రెడ్, లోకల్ చీజ్, గుడ్లు, పౌల్ట్రీ ఉత్పత్తులు యూఏఈలో స్థానిక ఉత్పత్తులు తక్కువ ధరను కలిగి ఉన్నాయని చెప్పారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com