ఏపీ జర్నలిస్టులకు భారీ షాక్ ఇచ్చిన సీఎం జగన్
- January 22, 2023
అమరావతి: సీఎం జగన్ ఎవర్ని వదిలిపెట్టడం లేదు..వరుస పెట్టి అందరికి షాక్ ఇస్తూ వస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు గగ్గోలు పెడుతుండగా..ఇప్పుడు జర్నలిస్టుల వంతు వచ్చింది. రాష్ట్రంలో ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో పనిచేస్తున్న రిపోర్టర్లు వృత్తి పన్ను కట్టాలంటూ నోటీసులు జారీ చేయడం ఇప్పుడు చర్చ గా మారింది.
అమలాపురంలో వివిధ పత్రికలు టీవీ చానెల్స్ లలో పనిచేస్తున్న 28 మంది విలేకరులకు జనవరి 17న నోటీసులు అందాయి. అమలాపురంలోని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్ సర్కిల్ కార్యాలయం నుంచి నోటీసులు వచ్చాయి. 2018-19 నుంచి 2022-23 వరకు సంవత్సరానికి రూ. 2500 చొప్పున మొత్తం రూ. 12,500 చెల్లించాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. 15 రోజుల్లోగా చెల్లించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.
దీంతో నోటీసులు అందుకున్న విలేకర్లు వాణిజ్యపన్నుల అధికారి సుబ్బారావును కలిశారు. నోటీసులు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. ఐదేళ్ల కంటే ఎక్కువ కాలం నుంచి ప్రభుత్వ అక్రెడిటేషన్ కార్డులు ఉన్న రిపోర్టర్ల నుంచి వృత్తిపన్ను వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని అందుకే నోటీసులు జారీ చేశామని సమాధానం చెప్పారు. కాగా గతంలో రాజంపేటలోనూ ఇదే విధంగా ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. అప్పుడు రిపోర్టర్లు ఆందోళనలు చేయడంతో నోటీసులు వెనక్కి తీసుకుంది. మళ్లీ కోనసీమలో ఈ వ్యవహారం తెరపైకి రావడంతో ఏపీలోని వివిధ పత్రికలు ఛానళ్లలో పనిచేస్తున్న రిపోర్టర్లు ప్రభుత్వం తీరును తప్పు పడుతున్నారు. పక్క రాష్ట్ర సీఎం జర్నలిస్టులకు పక్కా ఇళ్లు మంజూరు చేస్తూ వారికి కావాల్సిన సదుపాయాలు అందిస్తుంటే..జగన్ మాత్రం ఇలా బాదుడు కార్యక్రమం పెట్టుకున్నారని వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







