జపాన్-దుబాయ్ ఎమిరేట్స్ విమానంలో.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ
- January 22, 2023
యూఏఈ: జపాన్ నుంచి దుబాయ్ వస్తున్న ఎమిరేట్స్ విమానంలో ఓ మహిళా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. గురువారం నాడు టోక్యోలోని నరిటా అంతర్జాతీయ విమానాశ్రయం నుండి దుబాయ్‌కి వెళుతున్న EK319 విమానంలో ఒక మహిళ డెలివరీ అయిందని ఎమిరేట్స్ తెలిపింది. దుబాయ్ ఎయిర్ పోర్టులో దిగగానే తల్లీ బిడ్డలను ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. “జనవరి 19న టోక్యో నరిటా నుండి దుబాయ్‌కి వెళ్లే EK319 విమానంలో ఓ మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. విమాన సిబ్బంది సహాయం అందించారు. షెడ్యూల్ ప్రకారం విమానం దుబాయ్‌కి చేరింది. మహిళ, శిశువు క్షేమంగా ఉన్నారు. దుబాయ్ చేరుకున్న తర్వాత స్థానిక వైద్య సిబ్బంది వారిని ఆస్పత్రికి తరలించారు. మా సిబ్బంది, ప్రయాణీకుల ఆరోగ్యం, భద్రత మాకు ముఖ్యమైనది.’’ అని ఎమిరేట్స్ విమానయాన సంస్థ ప్రకటించింది. సాధారణంగా నెలలు నిండిన మహిళను విమాన ప్రయాణానికి అనుమతించనప్పటికీ, వైద్యపరమైన సమస్యలు, ఊహించని సమస్యల కారణంగా విమానాల్లో అనుమతి ఇస్తారు. గతేడాది డిసెంబర్లో తాను గర్భవతినని తెలియని ఓ మహిళ ఈక్వెడార్‌లోని గుయాకిల్ నుంచి ఆమ్స్టర్డామ్కు వెళ్లే KLM రాయల్ డచ్ విమానంలో ప్రసవించింది. ఆగస్టులో కువైట్ సిటీ నుండి మనీలాకు వెళుతున్న కువైట్ ఎయిర్వేస్ విమానంలో ఫిలిప్పీన్స్ మహిళ ప్రసవించిన ఉదంతాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!







