‘దుబాయ్ పెర్ల్’ కూల్చివేత..కంపించిన భూమి

- January 23, 2023 , by Maagulf
‘దుబాయ్ పెర్ల్’ కూల్చివేత..కంపించిన భూమి

దుబాయ్: 2002లో ప్రకటించిన దుబాయ్ పెర్ల్ సమూదాయం కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. దాదాపు 20 ఏళ్ల తర్వాత చేపట్టిన కూల్చివేతల కారణంగా సమీపంలోని దుబాయ్ మీడియా సిటీ, దుబాయ్ ఇంటర్నెట్ సిటీ అంతటా విస్తరించిన కార్యాలయాలలో ప్రకంపనలు సంభవించాయి. దుబాయ్ పెర్ల్ సైట్ చుట్టుపక్కల ప్రాంతాలలో నివాసితులు భయబ్రాంతులకు గురైనట్లు పలువురు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు వైరల్ అవుతున్నాయి. ప్రకంపనలు వచ్చిన సమయంలోనే దుబాయ్ పెర్ల్ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున దుమ్ము కమ్ముకున్నట్లు సోషల్ మీడియాలో చిత్రాలను షేర్ చేశారు. నవంబర్‌లో ప్రారంభమైన దుబాయ్ పెర్ల్ కూల్చివేతలు.. ఈవాళ తుది దశకు చేరుకున్నాయి. 2002లో మొదటిసారిగా ప్రకటించిన ఈ ప్రాజెక్ట్ లో 73-అంతస్తుల భవనాన్ని నిర్మించాలని అనుకున్నారు. కానీ పెట్టుబడిదారుల నిరాసక్తత కారణంగా 2009 నుండి నిర్మాణ పనులను నిరవధికంగా నిలిపివేశారు. అనంతరం ఈ ప్రాజెక్ట్ ను దుబాయ్ ప్రభుత్వం రద్దు చేసిందని ప్రచారం జరిగినా.. ఇంకా అధికారికంగా ఉత్తర్వులు వెలువడలేదని తెలుస్తోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com