శ్రీశ్రీ కి సిరాశ్రీ పద్యం

- April 30, 2016 , by Maagulf

సరిగ్గా 106 ఏళ్ళ క్రితం శ్రీశ్రీ పేరుతో యుగాలను శాసించగల కవితాశక్తి ఈ నేలపై అడుగు పెట్టిన రోజిది. పద్యాలు వ్రాయగలిగి, వ్రాసి, వాటిని విడనాడి, లయాత్మక వచన కవిత్వానికి ప్రాణం పోసిన ఆ కవికి ఒక మత్తకోకిల పద్యం. ఇది శ్రీశ్రీ గురించి కనుక "ఉన్మత్తకోకిల" అనొచ్చేమో!

"నేనుసైతము" మంత్రమూర్ఛన నిప్పురవ్వగ మండగా;
సానబెట్టిన కత్తియంచుల సాహితిన్ సృజియించగా;
దీనదేశపు వెఱ్ఱి చీకటి దిక్కులన్నియు వీడ, "శ్రీ
శ్రీ" నిజమ్మగు తేజమై, కవిసింగమై, విలసిల్లుగా!!
-సిరాశ్రీ

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com