ప్రారంభానికి సిద్ధమైన దుబాయ్ పొడవైన రైలు వంతెన

- January 25, 2023 , by Maagulf
ప్రారంభానికి సిద్ధమైన దుబాయ్ పొడవైన రైలు వంతెన

దుబాయ్: దుబాయ్‌లోని అతి పొడవైన రైలు వంతెన ఇప్పుడు ప్రారంభానికి సిద్ధమైంది. అల్ ఖుద్రా వంతెన చిత్రాలను ఎతిహాద్ రైల్ పోస్ట్ చేసింది. "ఎమిరేట్ మెయిన్‌లైన్ నెట్‌వర్క్‌లో పొడవైనది" అని క్యాప్షన్ ఇచ్చింది. మానవ నిర్మిత సరస్సుల సమూహాన్ని కలిగి ఉన్న అల్ ఖుద్రా.. 86కిమీ సైక్లింగ్ ట్రాక్‌కు నిలయంగా ఉంది. గత వారం ఎతిహాద్ రైల్ ఖలీఫా పోర్ట్‌ను జాతీయ రైల్వే నెట్‌వర్క్‌కు అనుసంధానించే 1కిమీ మెరైన్ బ్రిడ్జి వివరాలను వెల్లడించింది. అలాగే గత సంవత్సరం ఎతిహాద్ రైల్ అనేక మైలురాళ్లను చేరుకుంది. 1,200 కి.మీ పొడవైన నెట్‌వర్క్‌ను 75 శాతం పూర్తి చేసింది. ఎతిహాద్ రైల్ ప్రయాణీకుల సేవలు యూఏఈలోని 11 నగరాలలో అందుబాటులో ఉన్నాయి. 200kmph గరిష్ట వేగంతో ప్రయాణీకులు అబుధాబి నుండి దుబాయ్‌కి 50 నిమిషాల్లో.. అబుధాబి నుండి ఫుజైరాకు 100 నిమిషాల్లో ప్రయాణించవచ్చు. ఈ రైళ్లు ప్రయాణ సమయాలను 40 శాతం వరకు తగ్గించవచ్చని భావిస్తున్నారు. 2030 నాటికి ప్రయాణీకుల సంఖ్య ఏటా 36.5 మిలియన్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com