బాలయ్య వివాదంలోకి చిరంజీవిని లాగిన బండ్ల గణేష్.!
- January 25, 2023
అక్కినేని, తొక్కినేని.. అంటూ నోటికొచ్చినట్లు నోరు జారేసిన బాలయ్య వ్యాఖ్యలు ఇండస్ర్టీలో పెను దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ‘వీర సింహారెడ్డి’ విజయోత్సాహం ఏమో కానీ, ఆ సినిమాతో సంపాదించిన క్రేజ్ మొత్తం తన నోటి దురదతో ఇలా పోగొట్టేసుకున్నాడు బాలయ్య.
ఈ విషయంపై అక్కినేని అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. ఇదిలా వుంటే, బాలయ్య వ్యాఖ్యలు తీసుకుని, అనవరసరంగా చిరంజీవిని ఇరికించాడు ప్రముఖ నిర్మాత నటుడు అయిన బండ్ల గణేష్.
‘ఎన్టీయార్, ఏఎన్నార్, ఎస్వీయార్, చిరంజీవి.. వీళ్లంతా లెజెండ్స్.. వీళ్లని మేమంతా గౌరవిస్తాం..’ అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ఇప్పుడు నెక్స్ట్ లెవల్ వివాదానికి దారి తీసింది. ఈ గొడవలోకి చిరంజీవిని లాగినావెందుకు బండ్లా..! అంటూ నెటిజన్లు గగ్గోలు పెడుతుండగా, మరో వైపు వీళ్లే లెజెండ్స్ అయితే, మరి, కృష్ణ, కృష్ణం రాజు, శోభన్ బాబు.. వీళ్ల సంగతేంటీ.? అంటూ మరో వివాదం చెలరేగింది.
తాజా వార్తలు
- నాట్స్ విస్తరణలో మరో ముందడుగు షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్
- పాక్ ఆరోపణల పై భారతం ఘాటుగా స్పందన!
- రామమందిర నిర్మాణానికి భక్తుల విరాళం రూ.3వేల కోట్ల పైనే..
- బ్రెస్ట్ క్యాన్సర్ పై నాట్స్ అవగాహన సదస్సు
- తిరుమలలో వైభవంగా శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవ సంబరాలు
- అమెరికాలో ఘనంగా ఆటా మహాసభల కిక్ ఆఫ్!
- జస్టిస్ సూర్యకాంత్ కొత్త సీజేఐ!
- ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ఆధ్వర్యంలో “దండక సాహిత్యం–ఉనికి, ప్రాభవం' సభ విజయవంతం
- నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ: సీఎం చంద్రబాబు
- నవంబర్లో బ్యాంకులకు సెలవులే సెలవులు







