ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళ్లు అర్పించిన నారా లోకేష్
- January 25, 2023
హైదరాబాద్: టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ నెల 27 నుండి యువగళం పేరుతో పాదయాత్ర చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో లోకేష్…హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వెళ్లి తారకరామారావుకు నివాళి అర్పించారు. సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్ రావు, టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తో కలిసి ఎన్టీఆర్ కు శ్రద్ధాంజలి ఘటించారు.
అంతకు ముందు జూబ్లీహిల్స్ లోని నివాసంలో తల్లిదండ్రులు చంద్రబాబు, భువనేశ్వరి… అత్తమామలు బాలకృష్ణ, వసుంధర పాదాలకు నమస్కరించి వారి ఆశీర్వాదాలను తీసుకున్నారు. ఈ సందర్భంగా లోకేశ్ ను తండ్రి చంద్రబాబు ఆప్యాయంగా హత్తుకున్నారు. తన భర్తకు నారా బ్రాహ్మణి తిలకం దిద్ది, హారతి ఇచ్చారు. అనంతరం లోకేశ్ ఎన్టీఆర్ ఘాట్ కు పయనమయ్యారు.
ఇక కాసేపట్లో లోకేష్ కడపకు చేరుకోనున్నారు. అక్కడ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయం, పెద్ద దర్గా, మరియాపురం చర్చిలను దర్శించుకోనున్నారు. గురువారం తిరుమల శ్రీవారిని కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకోనున్నారు. ఎల్లుండి కుప్పం నుంచి లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభిస్తారు. కాగా లోకేష్ పాదయాత్ర కోసం ప్రత్యేక కర్వాన్ వాహనం సిద్ధం చేశారు. పాదయాత్రలో విశ్రాంతి, పార్టీ నేతలతో సమీక్షల కోసం కార్వాన్‌లో అధునాతన ఏర్పాట్లు చేశారు. ఈరోజు కార్వాన్ వాహనం హైదరాబాద్ నుంచి కుప్పం బయలుదేరనుంది. లోకేష్ పర్యటనను విజయవంతం చేసేందుకు టీడీపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
తల్లిదండ్రుల దీవెనలు, అత్త మామల ఆశీర్వాదాలు, కుటుంబ సభ్యుల, బంధు మిత్రుల ఆత్మీయ అభినందనల నడుమ 400 రోజుల పాటు జరిగే 4000 కి.మీ.ల సుదీర్ఘ పాదయాత్ర యువగళం ప్రస్థానం మొదలు పెట్టిన నారా లోకేష్.#YuvaGalam#LokeshPadayatra #NaraLokesh#NaraLokeshForPeople#YuvaGalamLokesh pic.twitter.com/0RR09YKU2U
— Telugu Desam Party (@JaiTDP) January 25, 2023
తాజా వార్తలు
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!







