74వ గణతంత్ర దినోత్సవం.. ఒమన్‌లోని భారతీయులకు శుభాకాంక్షలు

- January 26, 2023 , by Maagulf
74వ గణతంత్ర దినోత్సవం.. ఒమన్‌లోని భారతీయులకు శుభాకాంక్షలు

ఒమన్: భారతదేశ 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఒమన్‌లోని భారతీయులు, స్నేహితులందరికీ ఒమన్‌లో భారత రాయబారి హెచ్ఈ అమిత్ నారంగ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశం కూడా G20 ప్రెసిడెన్సీని కలిగి ఉన్న ఈ గణతంత్ర దినోత్సవం ప్రత్యేకమైనదన్నారు. భారతదేశం తన G-20 ప్రెసిడెన్సీ సమయంలో ఒమన్ సుల్తానేట్‌ను తన ప్రత్యేక అతిధులలో ఒకరిగా ఆహ్వానించడం గౌరవంగా ఉందన్నారు. ఇది భారతదేశం, ఒమన్ మధ్య స్నేహం, సహకారం, వాణిజ్యం పెరిగేలా కొత్త అవకాశాలను సృష్టిస్తుందన్నారు.  
పదేళ్ల క్రితం భారత జీడీపీ ప్రపంచంలోనే 11వ స్థానంలో ఉండేదని, ఇప్పుడు అది ఐదవ స్థానంలో ఉందన్నారు. 2030 నాటికి జపాన్ , జర్మనీలను అధిగమించి ప్రపంచంలోని 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరిస్తుందని అమిత్ నారంగ్ చెప్పారు. భారతదేశ GDP ఈ రోజు US$3.5ట్రిలియన్ల నుండి 2031 నాటికి US$7.5 ట్రిలియన్లకు చేరుతుందని మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసిందని గుర్తు చేశారు. సుమారు 6000 కంటే ఎక్కువ భారతదేశం-ఒమన్ జాయింట్ వెంచర్‌లకు ఒమన్ నిలయంగా ఉంది. ఇది US$7.5 బిలియన్ల పెట్టుబడికి సమానం. భారతదేశం నేడు ఎగుమతి శక్తి కేంద్రంగా ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో భారతదేశ సరుకుల ఎగుమతులు మొదటిసారిగా US$400బిలియన్లు దాటాయి.  
2021-22లో భారతదేశం-ఒమన్ ద్వైపాక్షిక వాణిజ్యం మునుపటి సంవత్సరం కంటే దాదాపు 90% పెరిగి, దాదాపు US$10 బిలియన్లకు చేరింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో ద్వైపాక్షిక వాణిజ్యం 2021, 2020, 2019, 2018లో నమోదు చేయబడిన వార్షిక గణాంకాల కంటే ఎక్కువగా ఉంది. 2021లో ప్రపంచవ్యాప్తంగా రియల్ టైమ్ డిజిటల్ చెల్లింపుల్లో 40 శాతం(48 బిలియన్ల లావాదేవీలు) భారతదేశంలోనే జరిగాయని అమిత్ నారంగ్ తెలిపారు. ఇది చైనా కంటే మూడు రెట్లు, యూఎస్, కెనడా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ దేశాలకంటే ఆరు రెట్లు ఎక్కువని చెప్పారు. భారతదేశం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) FY22లో US$1ట్రిలియన్ల కంటే ఎక్కువ విలువైన చెల్లింపులను ప్రాసెస్ చేసిందన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com