ఉద్యోగం కోల్పోతే గోల్డెన్ వీసా రద్దవుతుందా?

- January 26, 2023 , by Maagulf
ఉద్యోగం కోల్పోతే గోల్డెన్ వీసా రద్దవుతుందా?

యూఏఈ: యూఏఈ గోల్డెన్ వీసా ప్రారంభించినప్పటి నుండి దానికి ఫుల్ డిమాండ్ ఉంది. ఇది నిపుణులు, వ్యాపారవేత్తలకు మంచి అవకాశాలను కల్పిస్తుంది. అలాగే దేశంలో దీర్ఘకాల రెసిడెన్సీని ఇస్తుంది. 2019లో ప్రవేశపెట్టిన 10-సంవత్సరాల రెసిడెన్సీ పథకం ఇటీవల పెట్టుబడిదారులు, వృత్తిపరమైన వర్గాలకు విస్తరించారు. ప్రస్తుతం ఆస్తి పెట్టుబడిదారులు, నిపుణులు, శాస్త్రవేత్తలు, అత్యుత్తమ విద్యార్థులు, వ్యవస్థాపకులకు దీర్ఘకాలిక వీసా కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. వివిధ వృత్తుల్లో అత్యుత్తమ ప్రతిభను కనబరిచేందుకు ఇటీవల గోల్డెన్ వీసా అర్హతకు అవసరమైన కనీస వేతనాన్ని నెలకు Dh 50,000 నుంచి Dh30,000కి తగ్గించింది. దుబాయ్‌లోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (GDRFA) గత సంవత్సరం 80,000 గోల్డెన్ వీసాలను జారీ చేసింది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 69 శాతం అధికం. జనవరిలో అబుధాబి కూడా అన్ని వర్గాలకు గోల్డెన్ వీసా చెల్లుబాటును 5 నుండి 10 సంవత్సరాలకు పెంచింది.

అయితే, UAEలోని ఉద్యోగాలకు గోల్డెన్ వీసా లింక్ చేయబడిందా అనే దానిపై నివాసితులలో అనిశ్చితి నెలకొంది. ఉద్యోగం కోల్పోవడం వల్ల గోల్డెన్ వీసా కూడా రద్దు చేయబడుతుందా అన్న సందేహాలు చాలామందిలో ఉన్నాయి. ఇదే విషయాన్ని న్యాయ నిపుణుడిని అడిగితే.. గోల్డెన్ వీసా హోల్డర్ కంపెనీ స్పాన్సర్‌షిప్‌లో లేనందున, ఉద్యోగ నష్టం దీర్ఘకాలికంగా ఎటువంటి ప్రభావం చూపదని చెప్పారు. ఉద్యోగం కోల్పోవడం అనేది UAE దీర్ఘకాలిక రెసిడెన్సీ హోల్డర్‌లను ప్రభావితం చేయదని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. రిక్రూట్‌మెంట్, హెచ్‌ఆర్ ఎగ్జిక్యూటివ్‌లు దీర్ఘకాలిక రెసిడెన్సీని యూఏఈ ఆర్థిక వ్యవస్థ, సమాజానికి గేమ్ ఛేంజర్ అని పేర్కొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com