మలేషియా లో ఘనంగా 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

- January 27, 2023 , by Maagulf
మలేషియా లో ఘనంగా 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

కౌలాలంపూర్: కౌలాలంపూర్ లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో ఇండియన్ హై కమిషనర్ ఆఫ్ మలేషియా బి.ఎన్ రెడ్డి  జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మొదట రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగాన్ని చదివి వినిపించారు అనంతరం ఆయన మాట్లాడుతూ మలేషియా భారత స్నేహ పూర్వ సంబంధాల గురించి ఆయన మాట్లాడారు అలాగే మలేషియా లో నివసిస్తున్న భారతీయుల కోసం ప్రత్యేకంగా కంప్లైంట్ బాక్స్ ల ను వీసా సెంటర్ లో మరియు BLS కాన్సులర్ సెంటర్స్ లో ఏర్పాటు చేశారు ఇవి కాకుండా భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి తెలుసుకోవడానికి ప్రతి నెల ఒక రోజు ఓపెన్ డే నిర్వహిస్తున్నారు, దీనికి ఎలాంటి అప్పోయింట్మెంట్ అవసరం లేకుండా నేరుగా వెళ్ళవచ్చు.ఈ సంవత్సరం యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ ఇయర్ అఫ్ మిల్లెట్స్ గ డిక్లేర్ చేసిన సందర్భంగా మిల్లెట్స్ చిరుధాన్యాలను ప్రమోట్ చేయడం లో  భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారి డాన్స్ మరియు దేశ భక్తి పాటలతో ప్రేక్షకులను అలరించారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com