చివరి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్లో సానియా మీర్జా ఓటమి...

- January 27, 2023 , by Maagulf
చివరి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్లో సానియా మీర్జా ఓటమి...

ఆస్ట్రేలియా: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఓటమితో తన టెన్నిస్ కెరీర్‌ను ముగించారు. ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ మిక్స్‌డ్ డబుల్స్‌లో తన క్రీడా భాగస్వామి రోహన్ బోపన్నతో కలిసి ఫైనల్స్‌లో బ్రెజిల్ జోడీ లూయిసా స్టెఫానీ, రాఫెల్ మటోవోస్‌ జోడీతో తలపడ్డారు. ఈ మ్యాచ్‌లో సోనియా- బోపన్న జోడీ తొలి దశలో అధిక్యంలో కొనసాగినప్పటికీ తర్వాత తడబడటంతో ఓటమిపాలయ్యారు. దీంతో సానియా తీవ్ర నిరాశకు లోనయ్యారు. బావోద్వేగంతో కన్నీరు ఆపుకోలేక పోయారు.

తన సుదీర్ఘ టెన్నిస్ కెరీర్‌కు గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌తో ముగింపు పలుకుతానని సానియా మీర్జా ఇప్పటికే ప్రకటించారు.  ఆస్ట్రేలియా ఓపెన్ -2023 గ్రాండ్‌స్లామ్‌లో సానియా, బొపన్న జోడీ ఫైనల్ వరకు వచ్చారు. ఫైనల్స్‌ మ్యాచ్ శుక్రవారం జరిగింది.  ఈ ఫైనల్ పోరులో  సానియా- బోపన్న జోడీ 6-7, 2-6తో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. గేమ్ ముగిసిన అనంతరం రోహన్ బోపన్న సానియా తన జీవితాన్ని అద్భుతంగా కొనసాగించాలని ఆకాంక్షించారు. ఆ సమయంలో సానియా కన్నీళ్లు ఆపుకోలేకపోయింది.

సానియా మీర్జా తన ఆటతీరుతో దేశంలో ఎంతమంది యువతీయువకులను టెన్సిస్ క్రీడపై దృష్టిసారించేలా చేసింది. ఓటమి అనంతరం సానియా మాట్లాడుతూ.. అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విజేతగా నిలిచిన జోడీని అభినందించారు. నా వృత్తిపరమైన కెరీర్ 2005లో మెల్ బోర్న్‌లోనే ప్రారంభమైందని తెలిపారు. గ్రాండ్ స్లామ్‌తో కెరీర్‌కు ఇక్కడే వీడ్కోలు పలికేందుకు ఇంతకంటే మంచి ప్రదేశం మరొకటి ఉండదని సానియా అన్నారు. ఈ సమయంలో సానియా బావోద్వేగానికిలోనై  కన్నీటి పర్యాంతమయ్యారు. నా కుమారుడు చూస్తుండగా గ్రాండ్‌స్లామ్ ఫైనల్ మ్యాచ్ ఆడతానని నేనెప్పుడూ ఊహించలేదని చెప్పుకుంటూ సానియా మరోసారి కన్నీరు పెట్టుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com