భారతీయులకు రిపబ్లిక్ డే విషెస్ తెలిపిన రాయబారి అమిత్ నారంగ్
- January 27, 2023
మస్కట్: భారత 74వ రిపబ్లిక్ డే సందర్భంగా ఒమన్‌లో ఉంటున్న భారతీయులకు భారత రాయబారి అమిత్ నారంగ్ విషెస్ తెలియజేశారు.ఈ ఏడాది జీ-20 అధ్యక్ష బాధ్యతలు కలిగి ఉన్న ఈ గణతంత్ర దినోత్సవం చాలా ప్రత్యేకమైందిగా ఆయన పేర్కొన్నారు. అలాగే తన జీ-20 ప్రెసిడెన్సీలో ఒమన్ సుల్తానేట్‌ను తన ప్రత్యేక అతిథిగా ఆహ్వానించడం ఎంతో గౌరవంగా ఉందని తెలిపారు. ఇది భారత్, ఒమన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత దృఢ పరుస్తుందని చెప్పారు. 10ఏళ్ల క్రిత ఇండియా జీడీపీ ప్రపంచంలో 11వ స్థానంలో ఉండేదని, ఇప్పుడు అది 5వ స్థానానికి చేరడం గర్వకారణం అన్నారు.
అంతేగాక 2030 నాటికి జపాన్, జర్మనీలను అధిగమించి వరల్డ్‌లోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని రాయబారి చెప్పుకొచ్చారు.ప్రస్తుతం భారత జీడీపీ 3.5 ట్రిలియన్ డాలర్లు ఉంటే.. ఇది 2030 నాటికి 7.5 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసిన విషయాన్ని ఈ సందర్భంగా అమిత్ నారంగ్ గుర్తు చేశారు. ఇక 2021-22లో ఇండియా-ఒమన్ ద్వైపాక్షిక వాణిజ్యం గతేడాది కంటే సుమారు 90శాతం పెరిగి, 10బిలియన్ల డాలర్లకు చేరిందని తెలిపారు.
తాజా వార్తలు
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్‌లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్‌లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!







