‘తాజా’ సంక్రాంతి సంబరాలు
- January 27, 2023
అమెరికా: గ్రేటర్ జాక్సన్విల్ ప్రాంతంలోని తెలుగువారు సంప్రదాయబద్ధంగా సంక్రాంతి వేడుకలను జాక్సన్విల్ తెలుగు సంఘం (తాజా) ఆధ్వర్యంలో వైభవంగా జరుపుకున్నారు. జనవరి 21వ తేదీన తాజా అధ్యక్షుడు సురేష్ మిట్టపల్లి, వారి టీమ్ ఆధ్వర్యంలో జాక్సన్విల్లోని బొల్లెస్మిడిల్ స్కూల్ ఆడిటోరియంలో గ్రాండ్గా జరిగిన ఈ వేడుకలు అందరినీ తమ సొంత ఊరిలో వేడుకలను చేసుకుంటున్నామా అన్నట్లుగా మురిపించాయి. తెలుగుదనంతో ప్రదర్శించిన నాటకాలు, సాంస్కృతిక కార్యక్రమాలు తెలుగు భాషను, సాంస్కృతిక వైభవాన్ని చాటాయి. వేడుకలను పురస్కరించుకుని ముగ్గుల పోటీ, సంప్రదాయ దుస్తుల పోటీలను కూడా నిర్వహించారు. రంగురంగుల అలంకరణలు, రుచికరమైన అల్పాహారం, స్వీట్లతో కూడిన రాత్రి భోజనం మరియు కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. పద్మప్రియ కొల్లూరు, సమత దేవునూరి, వినయ యాద ఈవెంట్ డైరెక్టర్లుగా వ్యవహరించారు.
ఈ సందర్భంగా అధ్యక్షుడు సురేష్ మిట్టపల్లి మాట్లాడుతూ, ఈ వేడుకలను ఇంత గ్రాండ్ గా దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికీ, సహకరించిన అందరికీ ధన్యవాదాలను తెలుపుతూ, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలను తెలియజేశారు. తాజా ద్వారా కమ్యూనిటీకి నిర్వహించిన సేవా కార్యక్రమాలను తెలియజేశారు. తాజా ద్వారా నిర్వహించే కార్యక్రమాలకు ఎల్లప్పుడూ మద్దతుగా నిలిచిన ఎగ్జిక్యూటివ్ టీమ్ను కూడా అభినందించారు. కమిటీ సభ్యులు, వాలంటీర్లు, గ్రేటర్ జాక్సన్విల్లే ప్రాంత తెలుగు భాష, సంగీతం నేర్చుకునే పిల్లలు, మనబడి, పాఠశాల, సఖా ఇతర సంగీత పాఠశాలలు, తాజా కుటుంబాల వారి ఉపాధ్యాయుల మద్దతుతో జరిగిన ఈ వేడుకలు అందరినీ అలరించేలా సాగినందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ 2023 సంక్రాంతి ఈవెంట్కు ఉదారంగా స్పాన్సర్షిప్ చేసినందుకు వాసవి గ్రూప్ యుఎస్ఎ, భవన్ సైబర్టెక్కి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. రుచికమైన ఆహారాన్ని అందించినందుకు మసాలా ఇండియన్ క్యూసిన్ రెస్టారెంట్ కు ప్రత్యేక ధన్యవాదాలను తెలిపారు.



తాజా వార్తలు
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!







