శ్రీవారి భక్తుల కోసం కొత్త యాప్‌ను విడుదల చేసిన టిటిడి

- January 27, 2023 , by Maagulf
శ్రీవారి భక్తుల కోసం కొత్త యాప్‌ను విడుదల చేసిన టిటిడి

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) శ్రీవారి భక్తుల కోసం మొబైల్ యాప్ ను తీసుకువచ్చింది. దీనిపేరు ‘టిటి దేవస్థానమ్స్’. దీన్ని జియో ప్లాట్ ఫాంపై అభివృద్ధి చేశారు. టిటి దేవస్థానమ్స్ యాప్ సాయంతో తిరుమలలో స్వామివారి దర్శనం, గదుల బుకింగ్, ఆర్జిత సేవా టికెట్ల కొనుగోలు చేయవచ్చు.

ఈ యాప్ లో తిరుమల పుణ్యక్షేత్రం చరిత్ర, శ్రీవారి సేవల వివరాలు కూడా ఉంటాయి. అంతేకాదు, టిటిడి ఆధ్వర్యంలో నడిచే శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్ (ఎస్వీబీసీ) కార్యక్రమాలను కూడా ఈ యాప్ లో వీక్షించవచ్చు.

టిటిడి గతంలో ‘గోవింద’ అనే యాప్ ను ప్రవేశపెట్టింది. ‘గోవింద’ యాప్ కు అప్ డేటెడ్ వెర్షనే ఈ ‘టిటి దేవస్థానమ్స్’ యాప్. ఇదివరకే ‘గోవింద’ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్న వారు దాన్ని అప్ డేట్ చేసుకుంటే, ‘టిటి దేవస్థానమ్స్’ యాప్ లోకి ఆటోమేటిగ్గా ఎంటరవుతారు. లేకపోతే, నేరుగా గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లి ‘టిటి దేవస్థానమ్స్’ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ మేరకు టిటిడి వివరాలు తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com