భారీగా పడిపోయిన అదానీ గ్రూప్ షేర్లు..
- January 27, 2023
అమెరికా పరిశోధనా సంస్థ హిండెన్‌బర్గ్ నివేదిక అదానీ గ్రూప్‌పై భారీగా పడింది. దీనికి ప్రతికూల పరిస్థితులుకూడా తోడుకావటంతో అదానీ గ్రూప్ షేర్లు భారీగా పడిపోతున్నాయి. శుక్రవారం అదానీ గ్రూప్ కంపెనీ షేర్లు ముదుపర్లను నష్టాల్లో ముంచెత్తాయి. దీంతో ఆసియాలోనే అత్యంత సంపన్నుల జాబితాలో అగ్రస్థానంలోఉన్న గౌతమ్ అధానీ దిగువకు పడిపోయారు. గత రెండురోజుల పరిణామాల నేపథ్యంలో ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో ప్రపంచ కుబేరుల జాబితాలో నాలుగో స్థానంకు పడిపోయిన అదానీ.. శుక్రవారం ఒక్కసారిగా ఏడో స్థానానికి పడిపోయాడు.
2022 సంవత్సరంలో జెట్స్పీడ్తో దూసుకుపోయిన అదానీ ఆదాయం.. 2023 సంవత్సరంలో అదానీ గ్రూప్ షేర్లు భారీగా పడిపోతున్నాయి.ఈ నెలలో మొన్నటి వరకు బాగానేఉన్నప్పటికీ.. అమెరికన్ పరిశోధనా సంస్థ హిండెన్ బర్గ్ నివేదిక వచ్చిన తరువాత అదానీ గ్రూప్ షేర్ భారీ నష్టాలను చవిచూశాయి. కేవలం రెండు రోజుల్లోనే మార్కెట్ క్యాప్ రూ. 2.37లక్షల కోట్లు తగ్గింది. దీని కారణంగా గౌతమ్ అదానీ నికర విలువ రూ. 100.4 బిలియన్ డాలర్లకు తగ్గిపోయింది.దీంతో ప్రపంచ కుబేరుల జాబితాలో గౌతమ్ అదానీ ఏడవ ర్యాంకుకు పడిపోయాడు.
అదానీ గ్రూప్ కంపెనీ షేర్ల విలువలు పెంచడంలో అవకతవకలకు పాల్పడుతోందంటూ అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధనా సంస్థ హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదికే అదానీ గ్రూప్ షేర్లు విలువ అమాంతం తగ్గిపోవటానికి కారణమైంది. అయితే, ఈ నివేదికను అదానీ గ్రూప్ ఖండించినప్పటికీ శుక్రవారం సైతం ఆ గ్రూప్ షేర్లు మదుపర్లను నష్టాల్లో ముంచెత్తాయి. అయితే హిండెన్‌బర్గ్ పై న్యాయపరమైన చర్యలు తీసుకొనేందుకు అవకాశాలను అన్వేషిస్తున్నట్లు అదానీ గ్రూప్ ప్రతినిధులు తెలిపారు.
తాజా వార్తలు
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్‌లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్‌లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!







