ఏపీలో ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణం
- January 27, 2023
అమరావతి: ఏపీ హైకోర్టు నూతన న్యాయమూర్తులుగా జస్టిస్ జ్యోతిర్మయి, జస్టిస్ గోపాలకృష్ణలు ప్రమాణ స్వీకారం చేశారు. ఇద్దరు నూతన న్యాయమూర్తులచే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా వీరిచే శుక్రవారం ప్రమాణస్వీకారం చేయించారు. కోర్టు ప్రారంభం కంటే ముందు మొదటి కోర్టులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రస్తుతం హైకోర్టులో 30 మంది న్యాయమూర్తులు సేవలందిస్తున్నారు.
నూతన న్యాయమూర్తుల రాకతో వీరి సంఖ్య 32 కు చేరుకుంది. ఈనెల 10వ తేదీన వీరి పేర్లను కొలిజీయం సిఫార్సు చేయగా తాజాగా రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో శుక్రవారం ఇద్దరు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి న్యాయమూర్తులు, న్యాయవాదులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!







