అబుధాబి నుండి కోల్‌కతాకు డైలీ విమాన సర్వీసులు
- January 27, 2023
యూఏఈ: కోవిడ్-19 పరిమితుల సడలింపుతో ప్రయాణికుల కోసం మరిన్ని విమాన సర్వీసులు ప్రారంభం అవుతున్నాయి. ఇందులో భాగంగా ఎతిహాద్ ఎయిర్‌వేస్ మార్చి 26, 2023 నుండి అబుధాబి నుండి కోల్‌కతాకు రోజువారీ విమానాలను నడుపుతున్నట్లు ప్రకటించింది. భారత్ లోని కోల్ కతాకు వారంలో ఏడు రోజులపాటు విమాన సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని ఎతిహాద్ వెల్లడించింది. అలాగే, అబుధాబి- డ్యూసెల్డార్ఫ్( జర్మనీ), అబుధాబి-కోపెన్‌హాగన్‌కు విమానాలు నడుపనున్నట్లు తెలిపింది. దుబాయ్‌కి చెందిన విమానయాన సంస్థ ఫ్లైదుబాయ్ జూన్ 23 నుండి 10 కొత్త గమ్యస్థానాలకు విమానాలను నడపనున్నట్లు ప్రకటించింది. ఎయిర్ అరేబియా మార్చి 20, 2023 నుండి మలేషియా రాజధాని కౌలాలంపూర్‌కు నేరుగా విమానాలను ప్రారంభించనుంది. షార్జా అంతర్జాతీయ విమానాశ్రయం నుండి వారానికి మూడు విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్బోర్న్ అనే రెండు ప్రధాన నగరాలకు తన సేవలను విస్తరించినట్లు ఎమిరేట్స్ వెల్లడించింది.
తాజా వార్తలు
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్‌లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్‌లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!







