ఎల్ఐసీలో అద్భుతమైన పాలసీ..
- January 27, 2023
భారత ప్రభుత్వ రంగ బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) అద్భుతమైన పాలసీలు ఉన్నాయి. చిన్నారుల నుంచి పెద్దల వరకు రకరకాల పాలసీలు అందుబాటులో ఉన్నాయి.తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో ఎక్కువ బెనిఫిట్ వచ్చే పాలసీలు ఎన్నో ఉన్నాయి. మనీ బ్యాంక్, చిల్డ్రన్స్ పాలసీ, టర్మ్ పాలసీ, ఎండోమెంట్ పాలసీ ప్లాన్స్, రిటైర్మెంట్ పాలసీలు ఇలా ఎన్నో రకాల ఇన్సూరెన్స్ పాలసీలను అందిస్తోంది.ఇక పాలసీల్లో ‘ఆధార్ స్తంభ్ పాలసీ’ ఒకటి.
ఎల్‌ఐసీ ఆధార్ స్తంభ్ పాలసీ తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.ఆధార్ స్టాంబ్ అనేది నాన్-లిక్డ్, లాభాపేక్షతో కూడిన ఎండోమెంట్ ప్లాన్. నెలకు 901 ఆదా చేసుకుని ఈ పాలసీతో ఇన్వెస్ట్ చేస్తే మీరు దాదాపు రూ.4 లక్షలు పొందే అవకాశం ఉంటుంది. ఐదేళ్ల తర్వాత లాయల్టీ అడిషన్స్ కూడా లభిస్తాయి. 8 ఏళ్ల నుంచి 55 ఏళ్ల మధ్యలో వయసు ఉన్న వారు ఈ పాలసీ తీసుకోవచ్చు.
ఈ ఎల్‌ఐసీ పాలసీని కనీసం రూ.75,000 బీమా మొత్తాన్ని తీసుకోవాలి. గరిష్టంగా రూ.3,00,000 మొత్తం వరకు తీసుకోవచ్చు.ఈ పాలసీ తీసుకోవడం వల్ల డెత్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. పాలసీ తీసుకున్న వ్యక్తి తొలి ఐదేళ్లలోనే మరణిస్తే.. అప్పుడు పాలసీ మొత్తాన్ని నామినీకి అందజేస్తారు. అదే పాలసీదారుడు ఐదేళ్ల తర్వాత మరణిస్తే అప్పుడు నామినీకి బీమా మొత్తంతో పాటు లయల్టీ అడిషన్స్ కూడా అందిస్తారు.
ఉదాహరణకు చెప్పాలంటే.. 8 ఏళ్ల వయసు ఉన్న వారికి ఈ పాలసీ తీసుకుందామని భావిస్తే పాలసీ టర్మ్ 20 ఏళ్లు. రూ.3 లక్షల మొత్తానికి పాలసీ తీసుకున్నాం. ఇప్పుడు తొలి ఏడాది ప్రీమియం రూ.10,541 అవుతుంది. ఆరు నెలలకు రూ.5327, మూడు నెలలకు రూ.2627, నెలకు రూ.898 అవుతుంది.అయితే మీరు పాలసీ గడువులో ప్రీమియం రూపంలో దాదాపు రూ.2 లక్షలు చెల్లిస్తారు. మీకు మెచ్యూరిటీ సమయంలో రూ.3 లక్షల బీమా మొత్తం అందిస్తారు.లాయల్టీ అడిషన్ రూ.97,500. అంటే మీకు మొత్తంగా చేతికి దాదాపు రూ.4 లక్షలు వస్తాయి. 8 ఏళ్ల చిన్న పిల్లల పేరుపై ఈ పాలసీ తీసుకుంటే ఉత్తమం.మరిన్ని పాలసీ వివరాలకు ఈ నెంబర్ 9949322175 కి కాల్ చెయ్యగలరు.
తాజా వార్తలు
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!







