మస్కట్ నైట్స్ తాత్కాలికంగా మూసివేత
- January 27, 2023
మస్కట్: ఒమన్ గవర్నరేట్‌ల సుల్తానేట్‌లలో మస్కట్ నైట్స్ ఫెస్టివల్ కొన్ని కార్యకలాపాలు అనిశ్చిత వాతావరణ పరిస్థితుల కారణంగా తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి. వాతావరణ అస్థిరత, భద్రత దృష్ట్యా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మెటియోరాలజీ జారీ చేసిన హెచ్చరికల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నసీమ్ పార్క్, కురుమ్ నేచురల్ పార్క్, ఒమన్ కన్వెన్షన్, ఎగ్జిబిషన్ సెంటర్లలో మస్కట్ నైట్స్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఒమన్ ఆటోమొబైల్ అసోసియేషన్‌లోని ఇండోర్ కార్యకలాపాలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని తెలిపింది. వాతారవరణ పరిస్థితులు సాధారణంగా మారితే అన్ని కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవుతాయని మున్సిపాలిటీ తెలిపింది. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, సంబంధిత అధికారుల సూచనలను పాటించాలని అధికార యంత్రాంగం కోరింది. శనివారం వరకు ముసందమ్, నార్త్ అల్ బతినా, సౌత్ అల్ బతినా, అల్ బురైమి, అల్ దహిరా, అల్ దఖిలియా, గవర్నరేట్‌లు మస్కట్‌లో వడగళ్లతో కూడిన ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
తాజా వార్తలు
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!







