ఫిబ్రవరి 1 నుండి రాష్ట్ర స్ధాయి పాలిటెక్నిక్ స్పోర్ట్స్ మీట్
- January 27, 2023విజయవాడ: విద్యార్దులలోని క్రీడాస్పూర్తిని పెంపెందించే క్రమంలో మూడు రోజుల పాటు ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ మీట్ ను నిర్వహిస్తున్నామని సాంకేతిక విద్యా శాఖ సంచాలకురాలు చదలవాడ నాగరాణి తెలిపారు. స్పోర్ట్స్ , గేమ్స్ మీట్ కు సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించి, వివరాలను ప్రకటించారు. ఫిబ్రవరి 1 నుండి 3వ తేదీ వరకు విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఆటల పోటీలను నిర్వహించనున్నామన్నారు. గత 24 సంవత్సరాలుగా కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా ఇది 25వ మీట్ కానుందని తెలిపారు. ఇప్పటికే పూర్వపు జిల్లాల స్దాయిలో ప్రాంతీయ స్టోర్ట్స్ మీట్ లు పూర్తికాగా, అక్కడ ప్రధమ , ద్వితీయ స్దానాలు దక్కించుకున్న వారు రాష్ట్ర స్ధాయికి అర్హత సాధించారని నాగరాణి తెలిపారు. తొలిరోజు కార్యక్రమానికి రాష్ట్ర ఆర్ధిక, ప్రణాళిక, నైపుణ్యాభివృద్ది శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ హాజరు కానున్నారన్నారు. గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో సంయిక్త సంచాలకులు పద్మారావు, ప్రాంతీయ సంయిక్త సంచాలకులు జెఎస్ ఎన్ మూర్తి, సాంకేతిక విద్యా మండలి కార్యదర్శి విజయ భాస్కర్, శిక్షణ, ఉపాధి అధికారి డాక్టర్ రామ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ