జార్ఖండ్ హాస్పిటల్‌లో అగ్నిప్రమాదం..ఐదుగురు మృతి
- January 28, 2023
ధన్బాద్: జార్ఖండ్ లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ధన్బాద్లోని పురానా బజర్ లోని ఓ హాస్పిటల్ లో జరిగిన ఈ ప్రమాదంలో డాక్టర్ దంపతులతో సహా ఐదురుగు మృతి చెందారు. శుక్రవారం (జనవరి 17,2023) రాత్రి హజ్రా హాస్పిటల్‌లో జరిగిన ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు మృతి చెందగా మరొకొందరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు డాక్టర్ వికాస్ హజ్రా, అతని భార్య ప్రేమ హజ్రాతో పాటు మరికొందరు ఉద్యోగులు మరణించారు. మంటలు చెలరేగాక ఆర్పేయత్నం జరగకపోవటం..దట్టమైన పొగ అలుముకోవటంతో అందరూ ఊపిరి ఆడక మరణించినట్లుగా గుర్తించారు.
హాస్పిటల్ మొదటి అంతస్థులోని స్టోర్ రూమ్‌లో చెలరేగిన మంటలు క్రమంగా ఆస్పత్రి మొత్తం వ్యాపించాయి. ఈ సమయంలో అందరూ గాఢ నిద్రలో ఉండడంతో జరుగుతున్న ప్రమాదాన్ని గుర్తించలేకపోయారు. ఈ అగ్నిప్రమాదంలో మొదటి అంతస్తులో నివాసం హాస్పిటల్ యజమానులు మేనేజర్ డాక్టర్ ప్రేమా హజ్రా, ఆమె భర్త డాక్టర్ వికాస్ హజ్రాతో పాటు వారి పనిమనిషి..మరో ముగ్గురు మృతి చెందారు.
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బందితో సహా ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. సహాయక చర్యల్ని చేపట్టారు. రోగులు ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు కానీ దాదాపు తొమ్మిది మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. గాయపడినవారిని సమీపంలోని పాటలీపుత్ర నర్శింగ్ హోమ్ కు తరలించి చికిత్సనందిస్తున్నామని తెలిపారు. హాస్పిటల్ లో ప్రమాదం సంభవిస్తే మంటలు ఆర్పటానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదని అందుకే ఐదుగురు చనిపోవటంతో పలువురు గాయపడటం జరిగిందని తెలిపారు. హాస్పిటల్ నిర్వాహకుల నిర్లక్ష్యానికి డాక్టర్ దంపతులతో పాటు మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







