నకిలీ పాస్‌పోర్ట్ తో పట్టుబడ్డ బంగ్లాదేశీ
- January 28, 2023
తమిళనాడు: ఎయిర్ అరేబియా విమానం షార్జా నుంచి కోయంబత్తూర్ వచ్చింది. విమానాశ్రయంలో దిగగానే అధికారులు ఎప్పటిలాగే ప్రయాణికుల సాధారణ చెకింగ్ మొదలెట్టారు. ఈ క్రమంలో వారికి ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు.అతడికి భారత పాస్‌పోర్ట్ ఉంది.కానీ, అతడు భారతీయు పౌరుడు కాదు అనే విషయం అధికారులు గ్రహించారు.వెంటనే అతడిని పక్కకు తీసుకెళ్లి విచారించారు. అదే సమయంలో అతడికి తాను భారతీయుడేనని నిరూపించుకునేందుకు ఓ స్పెషల్ టెస్టు కూడా పెట్టారు. అంతే.. ఆ టెస్టులో అతడు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.దాంతో అధికారులు సదరు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. అతడి పేరు అన్వర్ హుస్సేన్ షార్జాలో టైలర్‌గా పని చేస్తున్నాడు. సెలవులపై ఇటీవల భారత్‌కు వచ్చిన అన్వర్ గత సోమవారం కోయంబత్తూర్ విమానాశ్రయంలో దిగాడు.అతడికి తమిళనాడులోని తిరుప్పూర్ చిరునామాతో భారత పాస్‌పోర్ట్ ఉంది.కానీ, ఎయిర్పోర్ట్ అధికారులకు అతడు భారతీయ పౌరుడు కాదు అనే అనుమానం వచ్చింది.దాంతో అన్వర్‌ను పక్కకు తీసుకెళ్లి విచారించారు.ఆ సయమంలో అధికారులు అడిగిన ప్రశ్నలకు అతడు చెప్పిన సమాధానాలు పొంతనలేకుండా ఉన్నాయి.దాంతో అధికారుల అనుమానం మరింత బలపడింది.చివరగా అతడిని భారత జాతీయగీతం పాడమని అడిగారు.అంతే.. మనోడికి నోటమాట రాలేదు.వెంటనే అసలు విషయం చెప్పేశాడు.
తనది బంగ్లాదేశ్‌లోని మైమెన్సింగ్ జిల్లా ప్యారీ గ్రామం అని, 2018లో తమిళనాడులోని తిరుప్పూర్‌లో కొన్నాళ్లు పని చేసిన్నట్లు చెప్పాడు.ఆ సమయంలోనే అక్కడి స్థానిక చిరునామాతో మొదట ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికేట్ పొందాడట.ఆ తర్వాత వాటితోనే 2020లో భారత పాస్‌పోర్ట్ సంపాదించాడు. అనంతరం అదే పాస్‌పోర్ట్‌తో యూఏఈ వెళ్లిపోయాడు.ప్రస్తుతం షార్జాలో టైలరింగ్ పని చేస్తున్నాడు.రెండేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఇండియాకు వచ్చి పట్టుబడ్డాడు.అధికారులు అన్వర్ హుస్సేన్‌పై ఫారిన్ యాక్ట్ కింద అభియోగాలు మోపారు.ప్రస్తుతం అతడు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
తాజా వార్తలు
- చైనా: ప్రపంచంలోనే అతిపొడవైన టన్నెల్
- మనమా-దియార్ అల్ ముహారక్ మధ్య కొత్త బ్రిడ్జి..!!
- ఉగ్రవాదుల బాంబు దాడిని ఖండించిన ఖతార్..!!
- ప్రవాస కార్మికుల ఫుడ్ స్క్రీనింగ్ కేంద్రాలలో తనిఖీలు..!!
- ఫుడ్ ట్రక్ స్టార్టప్‌లకు మద్దతుగా మసార్ ప్రారంభం..!!
- కత్తితో దాడి..6 మందికి జైలు శిక్ష, బహిష్కరణ వేటు..!!
- కువైట్ లో నీటి భద్రతకు భరోసా..లార్జెస్ట్ వాటర్ ప్లాంట్..!!
- తెలంగాణ: మహిళలకు ‘కామన్ మొబిలిటీ’ కార్డులు
- ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం..
- తిరుపతి: నూతనంగా నిర్మించిన జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







