'మోస్ట్ ఇన్నోవేటివ్' అవార్డును గెలుచుకున్న బహ్రెయిన్ ఎయిర్‌పోర్ట్

- January 29, 2023 , by Maagulf
\'మోస్ట్ ఇన్నోవేటివ్\' అవార్డును గెలుచుకున్న బహ్రెయిన్ ఎయిర్‌పోర్ట్

బహ్రెయిన్: బిజినెస్ టాబ్లాయిడ్ (BT) అవార్డుల వేడుకలో "మోస్ట్ ఇన్నోవేటివ్ ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ కంపెనీ – బహ్రెయిన్ 2022" అవార్డును బహ్రెయిన్ ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ (BAS) గెలుచుకుంది. ఈ కార్యక్రమం జనవరి 19న అట్లాంటిస్ ది పామ్ దుబాయ్‌లో జరిగింది. బీఏఎస్ చైర్మన్ నబీల్ ఖలీద్ కానూ, బీఏఎస్ సీఈవో మహ్మద్ ఖలీల్ అవార్డును స్వీకరించారు. వార్షిక బిజినెస్ టాబ్లాయిడ్ అవార్డ్స్ బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్, టెక్నాలజీ, హెల్త్‌కేర్, లీడర్‌షిప్, లాజిస్టిక్స్ & ట్రాన్స్‌పోర్టేషన్‌తో సహా వివిధ పరిశ్రమలలో విశేష కృషి చేసిన సంస్థలకు అవార్డును అందజేస్తుంది. ఈ సందర్భంగా BAS చైర్మన్ మాట్లాడుతూ.. తాము అమలు చేస్తున్న నాణ్యతా ప్రమాణాల గుర్తింపుగా అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు. తాము బహ్రెయిన్‌ను విమానయాన సేవల రంగంలో అగ్రగామిగా నిలిపి, రాజ్యం ఆర్థిక వ్యవస్థకు దోహదపడే ప్రముఖ సేవలను అభివృద్ధి చేస్తూనే ఉన్నామని ఆయన తెలిపారు.    

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com