రాబోయే ముడురోజులపాటు కువైట్ లో భారీ వర్షాలు!
- January 29, 2023
కువైట్: కువైట్‌లో సోమవారం(జనవరి 30) నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని, మంగళవారం(జనవరి 31) క్రమంగా పెరిగి బుధవారం(ఫిబ్రవరి 1) ఉదయం వరకు కొనసాగవచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది. మంగళవారం నుంచి వర్షం కురిసే అవకాశాలు క్రమంగా పెరుగుతాయని, మంగళవారం మధ్యాహ్నం నుంచి బుధవారం ఉదయం వరకు వర్షం కురిసే అవకాశం ఉందని డిపార్ట్మెంట్లోని నావిగేషనల్ ఫోర్కాస్టింగ్ విభాగం అధిపతి అమీరా అల్-అజ్మీ తెలిపారు. సోమవారం ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని, బుధవారం మళ్లీ తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. బుధవారం పగటిపూట వాతావరణం మెరుగుపడుతుందని తెలిపారు.
తాజా వార్తలు
- ప్రపంచ తెలుగు మహాసభలు..పెయింటింగ్స్‌కు ఆహ్వానం
- జేడీయూ షాక్ నిర్ణయం: 16 మంది నేతలకు బహిష్కరణ
- 3వ ప్రపంచ తెలుగు మహాసభలు–2026 ముఖ్యాంశాలు
- హరీశ్ రావు తండ్రి భౌతిక కాయానికి నివాళులర్పించిన కేసీఆర్..
- తీవ్ర తుపానుగా ‘మొంథా’.. ఏపీలో హైఅలర్ట్..
- దుబాయ్: ఏపీ మంత్రి టి.జి భరత్ తో మీట్ & గ్రీట్ ఏర్పాటు చేసిన INDEX ఎమిరేట్స్ గ్రూప్
- తెలుగు టైటాన్స్ vs పట్నా పైరేట్స్ పోరు
- యూఏఈలోని భారతీయ ప్రవాసులకు కొత్త చిప్‌తో కూడిన ఈ-పాస్‌పోర్ట్‌లు
- సౌదీలో 44 కొత్త ప్రొఫేషన్స్ లో స్థానికీకరణ అమలు..!!
- యూఏఈ లాటరీ Dh100-మిలియన్ల విజేత అనిల్‌కుమార్ బొల్లా..!!







