రామ్ చరణ్ స్వీట్ వార్నింగ్: ఎవరికో తెలుసా.?
- January 30, 2023మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి మూవీ ‘వాల్తేర్ వీరయ్య’ ఘన విజయం సాధించడంతో, ఈ సందర్భంగా సక్సెస్ మీట్ ఘనంగా నిర్వహించారు. ‘వీరయ్య విజయ విహారం’ అంటూ సాగిన ఈ ఈవెంట్‌కి వరంగల్ వేదికైంది. కాగా, ఈ వేడుకకు రామ్ చరణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.
‘వాల్తేర్ వీరయ్య’తో నాన్నకు ఇంత మంచి హిట్ ఇచ్చినందుకు వీరయ్య టీమ్కీ, అభిమానులకూ ధన్యవాదాలు తెలిపారు రామ్ చరణ్. ఆ తర్వాత నాన్నగారు చాలా సౌమ్యులు. కానీ, ఒక్కసారి బిగించి గట్టిగా మాట్లాడారంటే అది వేరే లెవల్లో వుంటుంది.
నాన్నగారు సైలెంట్‌గా వున్నారు. కానీ, ఆయన వెనకున్న అభిమానులు కానీ, కుటుంబ సభ్యులు కానీ కామ్‌గా వుండే అవకాశమే లేదు. ఆయన సైలెంట్‌గా వున్నారని ఎవరి నోటికొచ్చినట్లు వాళ్లు మాట్లాడితే ఊరుకోం.. ఇది సౌమ్యంగా ఇస్తున్న స్వీట్ వార్నింగ్.. అంటూ ఈ మధ్య మెగా ఫ్యామిలీపై అవాకులు చవాకులు పేలుతున్న వారికి గట్టి వార్నింగే ఇచ్చేశాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.
తాజా వార్తలు
- సోనియా గాంధీ తెలంగాణ పర్యటన రద్దు
- తెలంగాణ దశాబ్ధి వేడుకలు...
- గవర్నర్‌తో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం విక్రమార్క భేటీ
- నేడు హనుమాన్ జయంతి.. కొండగట్టుకు పోటెత్తిన భక్తులు
- గన్నవరం ఎయిర్ పోర్టులో సీఎం జగన్‌కు ఘన స్వాగతం..
- బంగారం స్మగ్లింగ్ చేస్తూ.. దొరికి ఫ్లైట్ అటెండెంట్
- జూన్ 15 నుండి సెప్టెంబర్ 15 వరకు మిడ్ డే వర్క్ బ్రేక్
- సౌక్ వాకిఫ్‌లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ ప్రారంభం
- MyHassad డ్రా..BD100,000 గెలుచుకున్న మహిళ..!
- 'నహీ కర్ పాయేంగే': రెసిడెన్సీ ఉల్లంఘనలకు అడ్డుకట్ట..!