గవర్నర్‌తో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం విక్రమార్క భేటీ
- June 01, 2024
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పదో వార్షిక ఆవిర్భావ వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. కీలకమైన ఆహ్వానితులకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెళ్లి ఆహ్వాన పత్రికలు అందిస్తున్నారు. ఈ ఉదయం రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ ను కలిసి ఆహ్వానించారు. జూబ్లీహిల్స్ నివాసం నుంచి రాజ్ భవన్ కు వెళ్లారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయనతో పాటు ప్రజా భవన్ నుంచి మల్లు భట్టి కూడా రాజ్ భవన్ కు వెళ్లారు. రాజ్ భవన్ లో గవర్నర్ రాధాకృష్ణన్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. . రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు గవర్నర్ ను ఆహ్వానించారు సీఎం, డిప్యూటీ సీఎం. ఏర్పాట్ల గురించి ఆయనకు వివరించారు. పదో వార్షిక వేడుకలకు సోనియాగాంధీ వస్తుండటంతో.. ప్రత్యేకంగా చరిత్రలో నిలిచిపోయేలా ఏర్పాట్లు చేస్తోంది రేవంత్ సర్కార్.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..