గన్నవరం ఎయిర్ పోర్టులో సీఎం జగన్‌కు ఘన స్వాగతం..
- June 01, 2024
గన్నవరం: లండన్ టూర్ ముగించుకొని ఏపీకి తిరిగివచ్చిన సీఎం జగన్ కు పార్టీ నేతలు , అభిమానులు ఘన స్వాగతం పలికారు. గన్నవరం ఎయిర్ పోర్టులో సీఎం జగన్‌కు ఎంపీలు విజయసాయిరెడ్డి, నందిగం సురేష్ , మంత్రులు జోగి రమేష్, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, కారుమూరి నాగేశ్వరరావు, మేరుగ నాగార్జున, కొట్టు సత్యనారాయణ స్వాగతం పలికారు.
ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు పూర్తైన తర్వాత మే 17 జగన్ ఫారెన్ టూర్ కు వెళ్లారు. అక్కడ లండన్, స్విట్జర్లాండ్లో ఫ్యామిలీతో తిరిగారు. పర్యటన ముంగించుకొని ప్రత్యేక విమానంలో రాష్ట్రానికి చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్ నుండి నేరుగా తాడేపల్లి నివాసానికి చేరుకున్నారు. ఈరోజు నుండి జగన్ రాజకీయాలతో బిజీ కాబోతున్నారు. కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేదానిపై నేతలతో చర్చలు జరపనున్నారు. 15 రోజులుగా రాష్ట్రంలో జరిగిన పరిణామాలపై కూడా సమీక్ష చేయనున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ సచివాలయంలో తప్పిన ప్రమాదం..
- ఇమ్మిగ్రేషన్ నిబంధనలు కఠినతరం: అతిక్రమిస్తే జరిమానా, జైలు శిక్ష
- షిర్డీ సాయి సేవలో రష్మిక, విక్కీ కౌశల్
- మూడో వన్డేలో ఇంగ్లాండ్ పై ఘన విజయం
- యూఏఈలో రమదాన్ : పవిత్ర మాసానికి ముందు భారీ డిస్కౌంట్లు..!!
- అబ్షర్ లో కొత్త సేవ.. దత్తత కుటుంబ సభ్యునికి పాస్పోర్ట్ జారీ..!!
- పోలీస్ అధికారిపై దాడి..అరబ్ మహిళకు ఏడాది జైలుశిక్ష..!!
- యూఏఈలో 20 మంది పర్యావరణవేత్తలకు బ్లూ వీసా ప్రదానం..!!
- కువైట్లో కీటకాలు కలిగిన ఆహార ఉత్పత్తులకు చోటు లేదు..!!
- సౌత్ అల్ బతినాలో ఓపెన్-ఎయిర్ సినిమా, ఎకో-టూరిజం హబ్..!!