యూఏఈలోని తెలుగు మహిళల ప్రతిభకు అవార్డుల ప్రధానం
- January 30, 2023
యూఏఈ: ఫెడరేషన్ ఆఫ్ NRI కల్చరల్ అసోసియేషన్స్ అండ్ గల్ఫ్ తెలంగాణ వెల్ఫేర్ & కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యూఏఈ లోని తెలుగు మహిళలకు సత్కారం మరియు అవార్డుల ప్రదానోత్సవం.షార్జాలోని ఎవాన్ హోటల్ బతుకమ్మ అవార్డ్స్ ప్రదానోత్సవం చాల ఘనంగా జరిగింది.వివిధ రంగాలలో సేవలు అందిస్తున్న మహిళలను,మన సంస్కృతి సంప్రదాయాలు మరియు పండుగలను విదేశాలలో జరుపుతూ మన సంస్కృతి విశ్వవ్యాప్తం చేస్తున్న మహిళలను మరియు COVID WARRIORS ని ఘనంగా సత్కరించి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది.FNCA అధ్యక్షుడు మిర్యాల వరప్రసాద్ గత 10 సంవత్సరాలుగు వివిధ దేశాలలో అవార్డ్స్ ప్రదానం చేస్తూ,యూఏఈలో కూడా మూడవ సారి తెలుగు మహిళాలను గౌరవించుకోవడం చాల ఆనందంగా ఉందని ముందు ముందు మహిళలను ప్రోత్సహించే కార్యక్రమాలను చేస్తానని ప్రకటించారు,మహిళల సాధికారత అంశం పై GTWCA బాద్యులు శామ్యూల్ ప్రసంగిస్తూ యూఏఈలోని తెలుగు మహిళల సేవలను కొనియాడారు, గల్ఫ్ తెలంగాణ అధ్యక్షుడు జువ్వాడి శ్రీనివాస్ రావు మాట్లాడుతూ గల్ఫ్ దేశాలలో బాతులకమ్మ పండుగను మొదటగా జరిపిన సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ అవార్డ్స్ ప్రదానోత్సవం జరగడం ఎంతో గర్వ కారణం అని ఇదే స్ఫూర్తి తో విశ్వవ్యాప్తంగా మన సంస్కృతి సామ్రాదాయాలు విలసిల్లాలని అందుకొరకు మహిళలకు ప్రోత్సాహక అవార్డ్స్ ప్రదానం చెయ్యడం జరిగిందని తెలిపారు.GTWCA ఉపాధ్యక్షులు మహమ్మద్ సలావుద్దీన్ మరియు కటకం రవి, మెట్ట రమేష్ చంద్ర,శంకర్ దేవరకొండ, విజయ్ యాదవ్, మల్లేష్,వంశీ గౌడ్, మోతే రాము, అనిల్, త్రిమూర్తులు, సౌమ్య జువ్వాడి, నాగమణి దామెర, పావని ,భారతి,పర్వీన్, తదితరులు ఈ కార్యక్రమం నిర్వహణలో ముందుండి విజ్జయవంతం చేశారు.ఈ కార్యక్రమానికి మాగల్ఫ్.కామ్ మీడియా పార్ట్నర్ గా వ్యవహరించింది.

తాజా వార్తలు
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!







