కువైట్‌లో ఐటీఎఫ్ టోర్నమెంట్‌: విజేతగా భారత ఆటగాడు ప్రజ్నేష్

- January 31, 2023 , by Maagulf
కువైట్‌లో ఐటీఎఫ్ టోర్నమెంట్‌: విజేతగా భారత ఆటగాడు ప్రజ్నేష్

కువైట్‌: ఆదివారం కువైట్‌లో జరిగిన ఐటీఎఫ్ కువైట్ పురుషుల ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత టెన్నిస్ ప్లేయర్ ప్రజ్నేష్ గుణేశ్వరన్(33) విజేతగా నిలిచాడు. 360 మాల్‌లోని షేక్ జాబర్ అల్-అబ్దుల్లా అల్-జాబర్ అల్-సబా ఇంటర్నేషనల్ టెన్నిస్ కాంప్లెక్స్‌లో జరిగిన $25,000 ITF పురుషుల టెన్నిస్ టోర్నమెంట్ ఫైనల్‌లో ప్రజ్నేష్ 6-2, 7-6(5)తో ఉజ్బెకిస్తాన్‌కు చెందిన ఖుమోయున్ సుల్తానోవ్‌ను ఓడించాడు. 19 దేశాలకు చెందిన 41 మంది క్రీడాకారులు పాల్గొన్న ఈ టోర్నమెంట్ కువైట్, అరబ్ టెన్నిస్ ఫెడరేషన్ల అధ్యక్షుడు షేక్ అహ్మద్ అల్-జాబర్ అల్-సబా పర్యవేక్షణలో జరిగింది. ఫైనల్ మ్యాచ్‌కు కువైట్ టెన్నిస్ ఫెడరేషన్ సెక్రటరీ జనరల్ ఫలేహ్ అల్-ఒతైబీ హాజరయ్యారు. 2019లో కెరీర్‌లో అత్యధికంగా 75వ స్థానంలో నిలిచిన ప్రజ్నేష్‌కు ప్రొఫెషనల్ సర్క్యూట్‌లో ఇది 11వ టైటిల్ కావడం గమనార్హం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com