విజయవాడలోని ఎ-1 కన్వెన్షన్ సెంటర్‌లో మేడే వేడుకలు
- May 01, 2016
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడలోని ఎ-1 కన్వెన్షన్ సెంటర్‌లో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రి సుజనాచౌదరితో పాటు, పలువురు రాష్ట్రమంత్రులు, కార్మికశాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రన్న బీమా పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. కోటి 50లక్షల మంది అసంఘటిత కార్మికులకు బీమా పథకం వర్తింపచేయనున్నారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. బీమా పథకం ద్వారా అసంఘటి రంగ కార్మికులు మరణిస్తే రూ.5లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు చెప్పారు. కార్మిక సంఘాలు స్వార్థం వీడాలని, మారిన పరిస్థితులకు అనుగుణంగా యాజమాన్యాలు ప్రణాళిక తయారు చేసుకోవాలని సూచించారు. ప్రపంచీకరణలో సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషిస్తోంది .. తక్కువ ఖర్చుతో నాణ్యంగా ఉంటేనే ఉత్పత్తులకు డిమాండ్ ఉంటుందన్నారు. రాయితీలు ఇచ్చి పరిశ్రమలకు ఆక్సిజన్ ఇచ్చామని పేర్కొన్నారు. విభజన మనం కోరుకున్నది కాదు.. అన్ని అన్ని రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి చెందే వరకు కేంద్ర చేయూత ఇవ్వాలని కోరారు. ఇబ్బందులున్నా.. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వివరించారు.కేంద్రమంత్రి సుజనాచౌదరి మాట్లాడుతూ.. కార్మికులే దేశానికి వెన్నెముక... కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న బీమా దేశంలో ఎక్కడా లేదన్నారు. కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. కార్మికులకు గృహ నిర్మాణాలపై యాజమాన్యాలతో చర్చిస్తున్నామన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు తెప్పించి ఉపాధి కల్పిస్తున్నామన్నారు. కార్మికశాఖకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు ఆన్‌లైన్ ద్వారా అమలు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, పల్లె రఘునాథరెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావు, ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, జలీల్‌ఖాన్, బొండా ఉమా, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







