రేపే కేంద్ర బడ్జెట్..మొబైల్ యాప్‌లో కూడా చూసే అవకాశం..!
- January 31, 2023
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ బుధవారం పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు. రెండేళ్లుగా పేపర్ లెస్ విధానంలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బడ్జెట్ ను ప్రభుత్వం సామాన్యులకూ అందుబాటులో ఉంచుతోంది. పార్లమెంట్ వెబ్ సైట్ తో పాటు మొబైల్ యాప్ లోనూ అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. మొబైల్ యాప్ లో బడ్జెట్ లోని ప్రతీ పేజీని వివరంగా చూడొచ్చని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పార్లమెంట్ లో ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రసంగం పూర్తయిన తర్వాత యాప్ లో బడ్జెట్ ను చూడొచ్చని పేర్కొన్నాయి.
కేంద్ర బడ్జెట్ ను మీ మొబైల్ ఫోన్ లోనే చూడాలంటే ప్లే స్టోర్ నుంచి యూనియన్ బడ్జెట్ (యూబీ) యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ నుంచి కూడా యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్, హిందీ భాషలలో బడ్జెట్ ప్రతులు ఇందులో అందుబాటులో ఉంటాయి. గ్రాంట్స్, ఫైనాన్స్ బిల్లులతో పాటు బడ్జెట్ లోని 14 పత్రాలు ఈ యాప్ లో చూడొచ్చు. బడ్జెట్ హైలైట్స్ ను కూడా యాప్ లో చదువుకోవచ్చు. ఇందులోని పేపర్లను కావాల్సినంతగా జూమ్ చేసుకుని చూసేలా యాప్ ను డిజైన్ చేశారు.
తాజా వార్తలు
- ఐఫోన్ ఎగుమతుల్లో చరిత్ర సృష్టించిన భారత్
- మస్కట్ చేరుకున్న ప్రధాని మోదీ
- సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లపై కేంద్ర ప్రభుత్వం కొరడా
- చరిత్రలో నిలిచేలా TTD నిర్ణయాలు..!
- ANR కాలేజీకి నాగార్జున రూ.2 కోట్ల విరాళం
- కోడూరు అవుట్‌ఫాల్ స్లూయిస్ల పునర్నిర్మాణం: ఎంపీ బాలశౌరి
- ఏపీ సీఆర్డీఏ నోటిఫికేషన్ విడుదల
- కార్తీక్ శర్మ: ఐపీఎల్ 2026 వేలంలో 14.2 కోట్లు..
- రేపు నటుడు విజయ్ భారీ ర్యాలీ
- శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి







