ఖతార్ లో 100% పైగా పెరిగిన విమాన ప్రయాణీకుల సంఖ్య
- January 31, 2023
దోహా: 2022 సంవత్సరంలో ఖతార్ విమానయాన రంగం రికార్డు సృష్టించింది. గతేడాది 35 మిలియన్లకు పైగా విమాన ప్రయాణికులను నమోదు చేసినట్లు ఖతార్ పౌర విమానయాన అథారిటీ తెలిపింది. ఇది 2021తో పోలిస్తే 101.9% పెరుగుదలను నమోదు చేసింది.ఈ మేరకు 2022 సంవత్సరానికి సంబంధించిన ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ గణాంకాలను వెల్లడించింది. 2021లో హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 17,703,274 మంది ప్రయాణికులు రాగా, 2022లో 35,734,243 మంది ప్రయాణికులు ప్రయాణించారు. 2022 సంవత్సరంలో విమానాల సంఖ్య 28.2% పెరిగింది. 2021లో నమోదైన మొత్తం విమానాలు 169,909 కాగా 2022లో వీటి సంఖ్య 217,875 కి పెరిగింది.నవంబర్ 20 నుండి డిసెంబర్ 18, 2022 వరకు జరిగిన FIFA వరల్డ్ కప్ ఖతార్ 2022కి ఖతార్ ఆతిథ్యం ఇవ్వడం వల్ల విమానాశ్రయంలో విమానాలు, ప్రయాణీకుల పరంగా గణనీయమైన పెరుగుదల నమోదు చేసుకుందని పౌర విమానయాన అథారిటీ పేర్కొంది.
తాజా వార్తలు
- క్రిప్టో కరెన్సీ, బ్లాక్ చైన్ సహా సరికొత్త ఆర్థిక నేరాలపై ఫోకస్: డీజీపీ అంజనీ కుమార్
- ముగిసిన హెచ్-1బీ వీసా అప్లికేషన్లు..
- మెక్సికో నగరంలో ఘోర అగ్నిప్రమాదం..39 మంది మృతి
- హైదరాబాద్ లో ఆస్కార్ విజేత చంద్రబోస్కు సత్కారం..
- జీ-20 సదస్సు-2023కు విశాఖ రెడీ
- ప్రజాగ్రహంతో దిగొచ్చిన ఇజ్రాయెల్ ప్రధాని..
- హైదరాబాద్ నగరాన్ని ఆహ్లాదకరంగా మార్చేందుకు కృషి
- పాన్-ఆధార్ లింక్ గడువు పెంపు..
- అదనపు ఆదాయాన్నిచ్చే ‘సెకండ్ శాలరీ’..!
- ఆకాశంలో కనువిందు చేయనున్న 5 గ్రహాలు..!