ఒమన్‌లో చెక్-బౌన్స్ కేసులదే అగ్రస్థానం: 2022లో 13 హత్యలు
- January 31, 2023
మస్కట్: 2022లో ఒమన్ సుల్తానేట్‌లో నమోదైన అన్ని నేరాల్లో బౌన్స్ చెక్కులు అగ్రస్థానంలో ఉన్నాయని, మొత్తం 4518 కేసులు(14.9 శాతం) నమోదయ్యాయని పబ్లిక్ ప్రాసిక్యూటర్ హిస్ ఎక్సలెన్సీ నస్ర్ బిన్ ఖమీస్ అల్ సవాయ్ తెలిపారు. 2022లో పబ్లిక్ ప్రాసిక్యూషన్ డీల్ చేసిన కేసుల గణాంకాలను సమీక్షించే పబ్లిక్ ప్రాసిక్యూషన్ వార్షిక సదస్సులో ఆయన వెల్లడించారు. గత సంవత్సరంలో ప్రజా హక్కుల కోసం సేకరించిన మొత్తం OMR 12.418 మిలియన్లు అని, గత సంవత్సరం జారీ చేసిన మొత్తం తీర్పుల సంఖ్య 15,442కి చేరుకుందని.. వాటిలో 90.2% అమలు చేయబడ్డాయని ఎక్స్ లెన్సీ వివరించారు. విచారణ సెషన్‌ల మధ్య విరామాలను తగ్గించే యంత్రాంగాన్ని ఆమోదించడానికి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింతగా ఉపయోగించుకోవడానికి ఒక ప్రణాళికపై పని చేస్తున్నట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ పేర్కొంది.
2022లో 13 హత్యలు
2022లో జరిగిన హత్యల సంఖ్య 13కు చేరిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వార్షిక సదస్సులో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ డాక్టర్ అహ్మద్ బిన్ సయీద్ అల్ షుకైలీ వెల్లడించారు. 2021లో కూడా ఈ సంఖ్య 13గానే ఉందని తెలిపారు. హత్యలను అధ్యయనం చేయడానికి, వాటి కారణాలను తెలుసుకోవడానికి పబ్లిక్ ప్రాసిక్యూషన్ సమర్థ అధికారంతో సమన్వయంతో పనిచేస్తుందని అల్-షుకైలీ తెలిపారు.
తాజా వార్తలు
- క్రిప్టో కరెన్సీ, బ్లాక్ చైన్ సహా సరికొత్త ఆర్థిక నేరాలపై ఫోకస్: డీజీపీ అంజనీ కుమార్
- ముగిసిన హెచ్-1బీ వీసా అప్లికేషన్లు..
- మెక్సికో నగరంలో ఘోర అగ్నిప్రమాదం..39 మంది మృతి
- హైదరాబాద్ లో ఆస్కార్ విజేత చంద్రబోస్‌కు సత్కారం..
- జీ-20 సదస్సు-2023కు విశాఖ రెడీ
- ప్రజాగ్రహంతో దిగొచ్చిన ఇజ్రాయెల్ ప్రధాని..
- హైదరాబాద్ నగరాన్ని ఆహ్లాదకరంగా మార్చేందుకు కృషి
- పాన్-ఆధార్ లింక్ గడువు పెంపు..
- అదనపు ఆదాయాన్నిచ్చే ‘సెకండ్ శాలరీ’..!
- ఆకాశంలో కనువిందు చేయనున్న 5 గ్రహాలు..!