BD15,000 మోసం కేసులో ఉద్యోగికి అనుకూలంగా కోర్టు తీర్పు
- February 01, 2023
బహ్రెయిన్: ఖాతాదారుల నుండి డబ్బును తీసుకోని BD15,000 మేర కంపెనీని మోసగించాడని యజమాని ఆరోపించిన ప్రైవేట్ కంపెనీ ఉద్యోగిని మైనర్ క్రిమినల్ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. సాక్షుల వాంగ్మూలాలు, ప్రతివాదిపై వచ్చిన ఆరోపణలను కోర్టు కొట్టివేసింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. క్లయింట్ల నుండి వచ్చిన డబ్బును కంపెనీ ఖాతాలో జమ చేయకుండా BD15,000లను తమ ఉద్యోగి సొంతానికి వాడుకున్నాడని కంపెనీ కోర్టులో దావా వేసింది. కానీ ఈ సంఘటనకు ముందు సదరు ఉద్యోగికి కంపెనీ యజమానికి గతంలో వివాదాలు ఉన్నాయని పేర్కొంటూ ఉద్యోగి న్యాయవాది దావాను కోర్టులో వ్యతిరేకించారు.తన లేబర్ బకాయిలను అభ్యర్థిస్తూ లేబర్ కేసును దాఖలు చేశాడని , వేతనాలు ఆలస్యమైనందుకు BD 1,653.333 లను ఉద్యోగికి చెల్లించాలని కంపెనీ యజమానిని లేబర్ కోర్టు గతంలో ఆదేశించిందని న్యాయవాది వెల్లడించారు. దీనికి ప్రతీకారం తీర్చుకోవడానికి యజమాని ఇప్పుడు తన క్లయింట్ అయినా ఉద్యోగిపై తప్పుడు ఆరోపణలు చేసాడని కోర్టులో వాదించారు. దావాను విచారించిన కోర్టు ఉద్యోగి అపరాధానికి ఖచ్చితమైన రుజువులు లేకపోవడంతో కేసును కొట్టి వేస్తూ తీర్పునిచ్చింది.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!