సగటు నెలవారీ జీతం: కువైట్ కుటుంబానికి KD 3994.9, నాన్-కువైట్ కుటుంబానికి KD 939.8

- February 01, 2023 , by Maagulf
సగటు నెలవారీ జీతం: కువైట్ కుటుంబానికి KD 3994.9, నాన్-కువైట్ కుటుంబానికి KD 939.8

కువైట్: 2021లో కువైట్ కుటుంబం సగటు నెలవారీ ఆదాయంలో 2.2% పెరుగుదల నమోదు చేసుకోగా.. నాన్-కువైట్ కుటుంబం సగటు నెలవారీ ఆదాయంలో 2.3% పెరుగుదల కనిపించింది. ఈ మేరకు సెంట్రల్ స్టాటిస్టికల్ బ్యూరో ఓ నివేదికను వెల్లడించింది. కువైట్ కుటుంబం సగటు నెలవారీ ఆదాయం KD 3994.9(అద్దె విలువను లెక్కించకుండానే) ఉండగా..  నాన్-కువైట్ కుటుంబం సగటు నెలవారీ ఆదాయం KD 939.8గా నమోడైంది.అదే విధంగా  2021లో కువైట్ కుటుంబం సగటు నెలవారీ ఖర్చు  KD 3296.6కి(అద్దె విలువను లెక్కించకుండానే ) చేరుకుంది.  5.6% పెరుగుదలను నమోదు చేసింది. నాన్-కువైట్ కుటుంబం  సగటు నెలవారీ ఖర్చు అKD 1071.3గా  అంచనా వేయబడింది. ఇది 4.4% పెరుగుదలను నమోదు చేసిందని సెంట్రల్ స్టాటిస్టికల్ బ్యూరో నివేదిక వెల్లడించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com