ఆర్థిక క్లెయిమ్‌ల కారణంగా రోగులను ఆపే హక్కు ఆరోగ్య సంస్థలకు లేదు

- February 01, 2023 , by Maagulf
ఆర్థిక క్లెయిమ్‌ల కారణంగా రోగులను ఆపే హక్కు ఆరోగ్య సంస్థలకు లేదు

రియాద్: ఆర్థిక క్లెయిమ్‌ల కారణంగా మరణించిన వారి మృతదేహాలు, రోగుల గుర్తింపు పత్రాలను నిలిపివేయవద్దని రియాద్‌లోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ అఫైర్స్ హెచ్చరించింది. ప్రైవేట్ హెల్త్ ఇన్‌స్టిట్యూషన్ చట్టంలోని ఆర్టికల్ 30 దాని ఎగ్జిక్యూటివ్ రెగ్యులేషన్‌ ప్రకారం..  మృతదేహాలను అప్పగించడంతోపాటు రోగులను, నవజాత శిశువులను డిశ్చార్జ్ చేయాల్సిందే.  హాస్పిటల్ బిల్లు చెల్లించని కారణంగా  మరణించిన వారి మృతదేహాలను అప్పగించక పోవడం, నవజాత శిశువు లేదా  రోగులను ఆసుపత్రి నుండి బయటకు వెళ్లనివ్వకుండా నిలిపివేయడానికి లేదా గుర్తింపు పత్రాలను నిలిపివేయడానికి  ఆరోగ్య సంస్థలకు హక్కు లేదు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ పర్యవేక్షణ పర్యటనలను నిర్వహిస్తోందని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడానికి ఆరోగ్య సంస్థ తనిఖీ కమిటీలకు సూచించినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ అఫైర్స్ తెలిపింది. అలాంటి ఉల్లంఘనలపై 937కి కాల్ చేయడం ద్వారా రిపోర్ట్ చేయాల్సిందిగా కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com