మెగాస్టార్‌తో ‘ఢీ’ అనబోతున్న ‘ఏజెంట్’.! నిజమేనా.?
- February 01, 2023
అక్కినేని అందగాడు అఖిల్‌కి ఇంతవరకూ సరైన హిట్టు పడలేదు. ప్రతీ సినిమానీ తొలి సినిమాలాగే చేస్తున్నాడీ యంగ్ హీరో. కానీ, సక్సెస్ మాత్రం దూరం దూరం అంటోంది పాపం.
ఇక, ఇప్పుడు ‘ఏజెంట్’ అంటూ స్పై గా రాబోతున్నాడు అఖిల్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ప్రెస్టీజియస్‌గా తెరకెక్కుతోంది ఈ సినిమా. ఎప్పుడో రిలీజ్ కావల్సి వుంది. కానీ, ఇంతవరకూ రిలీజ్ కాలేదు.
డిఫరెంట్ మేకోవర్‌తో చాలా కష్టపడుతున్నాడు ఈ సినిమా కోసం అఖిల్. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ అప్డేట్ ప్రచారంలో వుంది. ఈ సినిమాని మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ సినిమాతో పోటీగా బరిలోకి దించబోతున్నారనేది ఆ ప్రచారం తాలూకు సారాంశం.
ఏప్రిల్ 14న ‘భోళా శంకర్’ ఎప్పుడో స్లాట్ బుక్ చేసుకుంది. ఇదే డేట్‌కి అఖిల్ ‘ఏజెంట్’ కూడా వుండబోతోందనీ అంటున్నారు. అన్నట్లు ఈ రెండు సినిమాలూ ఒకే బ్యానర్ మీద ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో రూపొందడం విశేషం. ఈ ప్రచారంపై అధికారిక ప్రకటన రావల్సి వుంది.
తాజా వార్తలు
- మస్కట్‌లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!