BREAKING...'పే పాల్' లో ఊడిపోయిన 2000ఉద్యోగాలు
- February 01, 2023
ఆర్థిక మాంద్యం భయంతో టెక్ కంపెనీలన్నీ ఖర్చు తగ్గింపు చర్యలను చేపడుతున్నాయి. ఈ క్రమంలో భారీగా ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి.
పెద్ద పెద్ద కంపెనీలే తమ సంస్థలోని వేలాది మందిని ఉద్యోగం నుంచి తొలగించి ఇంటికి పంపించివేశాయి. తాజాగా.. వీరి అడుగుల్లోనే నగదు లావాదేవీలు, చెల్లింపులు జరిపే ఒక అంతర్జాతీయ ఈ-కామర్స్ సంస్థ పేపాల్ కంపెనీ 2వేలమంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లుగా ప్రకటించింది.
పేపాల్ హోల్డింగ్స్ ఇంక్ త్రైమాసికంలో స్థూల ఆర్థిక మందగమనం కారణంగా రెండు వేల మందిని జాబ్ నుంచి తీసేస్తున్నట్లు బుధవారం పేపాల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాన్ షుల్మాన్ ప్రకటించారు. ఉద్యోగుల తొలగింపు సంస్థలో7 శాతం మంది ఉద్యోగులపై ఉంటుందని తెలిపారు. కొన్ని వారాల్లో ఈ ప్రక్రియ అమలు అమలవుతుందని దీనికి సంబంధించి ఉద్యోగులకు మెమో పంపించామని తెలిపారు. ఈ కష్టాన్ని గట్టెక్కటానికి ఉన్న ఉద్యోగులతో పాటు తాము కూడా ఎంతో కష్టపడాల్సిన అవసరం ఉందన్నారు. పేమెంట్ గేట్ వే కంపెనీ అయిన పేపాల్ స్టాక్ దెబ్బతింది.
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం